కత్తి మహేష్ కు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ

Updated: Jul 9, 2018, 05:18 PM IST
కత్తి మహేష్ కు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తిమహేష్ పై తెలంగాణ పోలీసులు కొరడ ఝుళిపించారు. ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖలు చేసిన కత్తిపై 6 నెలల పాటు నగర  మహిష్కరణ  బహిష్కరణ వేటు వేశారు. తాజా నిర్ణయంతో ఇక ఆరు నెలల పాటు కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు వీలులేదు. నిషేదిత గడవు సమయంలో ఆయన నగరంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్షకు  అర్హులవుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇటీవలి కాలంలో కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ హీరోలపై విమర్శలు చేస్తూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రతి అంశంపై జోక్యం చేసుకుంటూ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా శ్రీరాముడిపై ఆయన చేసిన  వ్యాఖ్యలు వివాదంగా మారి చివరికి నగర బహిష్కరణకు దారి తీసింది

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లడినందుకే  కత్తిమహేష్ పై  చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి.. ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో  విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని చెప్పారు. ఏ రాష్ట్రానికి  చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొంది.