Kavitha: బీఆర్ఎస్ లో ఒంటరైన కవిత.. ధర్నాచౌక్ కు గులాబీ క్యాడర్ డుమ్మా..!

Kavitha: ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టిందా..! తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాను గులాబీ పార్టీ బాయ్‌కాట్ చేసిందా..! గులాబీ బాస్‌ కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. కేసీఆర్‌ కోసమే కవిత ధర్నా చేసినా గులాబీ నేతలు  అటువైపు కన్నెత్తి చూడలేదు. అసలు కవిత ధర్నాను బీఆర్‌ఎస్‌ లైట్‌ తీసుకుంటోందా. లేదా ఇంకా ఏదైనా కారణముందా ?  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 5, 2025, 08:09 AM IST
Kavitha: బీఆర్ఎస్ లో ఒంటరైన కవిత.. ధర్నాచౌక్ కు గులాబీ క్యాడర్ డుమ్మా..!

 Kavitha: గులాబీ పార్టీలో అంతర్గత పోరు కంటిన్యూ అవుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీ కవిత.. జాగృతి కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత నేతృత్వంలో భాగ్యనగరంలోని  ఇందిరా పార్క్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టారు. కేవలం కవిత కోటరీ, జాగృతికి సంబంధించిన నేతలు మాత్రమే అటెండ్ అయ్యారు. అంతకు ముందు పలు జిల్లాల్లో కవిత పర్యటనకు కూడా గులాబీ లీడర్లు దూరంగా ఉన్నారు. అయితే కవిత ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

Add Zee News as a Preferred Source

కొద్దిరోజుల క్రితం గులాబీ బాస్ కేసీఆర్‌ కవిత లేఖ రాశారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారంటూ బాంబ్‌ పేల్చారు. దాంతో కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరంటూ గులాబీ లీడర్లు కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన లేఖ లీక్‌ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కవిత.. ఆ లీక్ వీరులు ఎవరో బయటపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత.. కేటీఆర్‌ను పరోక్షంగా టార్గెట్‌ చేశారు. దాంతో బీఆర్‌ఎస్‌లో నుంచి కవితను సస్పెండ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కవిత మాత్రం కేసీఆర్‌ దేవుడు అంటూనే.. గులాబీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. దాంతో కవిత విషయంలో ఏం చేయాలో తెలియక.. కేసీఆర్ నుంచి ఆదేశాల కోసం బీఆర్‌ఎస్ లీడర్లు ఎదురుచూస్తున్నారు.. 

అయితే కవిత ధర్నాకు వెళ్లవద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతోనే నేతలు వెనక్కి తగ్గారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలు కొంతమంది తప్పుబడుతున్నారు. కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో కవిత ధర్నాకు చేపట్టారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ ధర్నాలో పాల్గొనవద్దని ఆదేశాలు ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారట. ఈ వ్యవహారాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట. ఇదే సమయంలో పార్టీలో కవిత రేపిన కాక బీఆర్ఎస్ ను రెండు ముక్కలు చేసేదిలా ఉందన్న వాదనకు తాజాగా జరిగిన కార్యక్రమం బలం చేకూర్చినట్టు అయ్యింది. 

మరోవైపు బీఆర్ఎస్ గొడుగు కింద రాజకీయాలు చేసేందుకు కవిత అంత ఆసక్తి చూపించడం లేదన్న టాక్ ఉంది.  తన పవర్ ఏంటో చూపించాలని ఆమె ఆరాటపడుతున్నారు. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ పార్టీని ఏర్పాటు చేసినా కేసీఆర్ చరిష్మాను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు మద్దతుగా మహాధర్నా నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటూ మాత్రం గులాబీ పార్టీ త్వరలోనే రెండు ముక్కలు కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News