Kavitha Kalvakuntla: మహిళలకు రక్షణ కరువు.. మొద్దు నిద్ర వీడి భద్రత చర్యలు తీసుకోండి.. రేవంత్‌ సర్కార్‌పై కవిత ఆగ్రహం..

Kavitha Kalvakuntla Fires On Revanth Govt: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవు అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె నాగర్‌ కర్నూల్‌, జర్మనీ మహిళపై అత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 1, 2025, 03:51 PM IST
Kavitha Kalvakuntla: మహిళలకు రక్షణ కరువు.. మొద్దు నిద్ర వీడి భద్రత చర్యలు తీసుకోండి.. రేవంత్‌ సర్కార్‌పై కవిత ఆగ్రహం..

Kavitha Kalvakuntla Fires On Revanth Govt: తెలంగాణలో కాంగ్రెస్‌ హయాంలో మహిళలకు భద్రత కరువు అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలపై వరుస నేరాలు, దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలకు భద్రత కరువైంది. ఇది ఆందోళన కలిగించే అంశం అని కవిత అన్నారు. మొన్న నాగర్‌కర్నూల్‌లోని ఓ దేవాలయం, నేడు హైదరాబాద్‌లో జర్మనీ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని కవిత మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలపై దారుణాలు 22 శాతం నేరాలు పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఏం పట్టనట్లు వ్యవహరించడం దేనికి సంకేతమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి మహిళలపై భద్రత చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా నేడు జర్మనీ మహిళ తన స్నేహితురాలితో కలిసి మీర్‌పేట వద్ద ఉంటోంది. మందమల్ల వద్ద ఎయిర్‌పోర్ట్‌ వెళ్లడానికి ఆమె క్యాబ్‌ కోసం ఎదురు చూస్తుండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఆమెకు లిఫ్ట్‌ ఇస్తామని నమ్మబలికి  ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పహాడీషరిఫ్‌ నిర్మాణుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మళ్లీ ఆ మహిళను తీసుకువచ్చి అక్కడే వదిలారు. దీంతో ఆమె వెంటనే పహాడీ షరిఫ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు అని పర్యవేక్షిస్తున్నారు. ఆమె విదేశీ మహిళ కావడంతో కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

 

 

ఇదిలా ఉండగా మొన్న నాగర్‌ కర్నూల్‌లోని ఓ ఆలయంలో తన కుటుంబ సభ్యులతోపాటు ఓ మహిళ నిద్రకు వచ్చింది. దీంతో రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చింది. దీంతో అక్కడే మాటు వేసి ఉన్న 8 మంది వ్యక్తులు సదరు మహిళపై దారుణంగా రేప్‌ చేశారు. ఆ సమయంలో తనతోపాటు ఉన్న బంధువును సైతం చెట్టుకు కట్టేసి కొట్టారు. ఎనిమిది ఆమెను దారుణంగా రేప్‌ చేశారు. ఎంత పాశవికంగా ఆమెపై దారుణానికి వడగట్టారు అంటే చివరకు ఆమెకు నీళ్లు కూడా ఇవ్వలేదు. మూత్రం కూడా ఆ మహిళతో తాగించారు. మొదట ఈ మహి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెనకాడింది. కానీ, బంధువుల చొరవతో కంప్లైంట్‌ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఆరుగురు మనవమృగాలను అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. 

READ ALSO: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. జర్మనీ యువతిపై గ్యాంగ్‌ రేప్‌, లిఫ్ట్‌ ఇస్తామని మోసగించి..

READ ALSO: పాము కాటు వేస్తే వెంటనే ఈ కూరగాయతో రుద్దండి.. విషం వ్యాపించదు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News