BRS Party: కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ.. తెలంగాణ చూపు ఎల్కతుర్తి వైపు

All Eyes And Ears On KCR Silver Jubilee Speech: ఉద్యమ పార్టీ.. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రల్లో మెరిసిన బీఆర్‌ఎస్‌ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. తెలుగు రాష్ట్రాలు ఆ సభపై దృష్టి పెట్టాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 26, 2025, 06:26 PM IST
BRS Party: కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ.. తెలంగాణ చూపు ఎల్కతుర్తి వైపు

BRS Party Silver Jubilee Highlights: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 25 వసంతాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టిన గడ్డ విముక్తి కోసం అనేక పోరాటాలు.. ఉద్యమాలు బీఆర్‌ఎస్‌ పార్టీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిదిన్నర ఏళ్లపాటు సుపరిపాలన అందించి దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి దిక్సూచిగా నిలిపారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో 2.05% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అనంతరం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ సమయంలో జరుగుతున్న ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా  పదిహేడు నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.

Add Zee News as a Preferred Source

Also Read: Harish Rao: 'కేసీఆర్‌ను చూడాలి.. కేసీఆర్ ప్రసంగం వినాలి' అనేదే ప్రజల అభిమతం

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27వ తేదీన ఏర్పడిన నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ రూపాంతరం చెంది 25 ఏళ్ల మైలురాయికి చేరుకుంది. రజతోత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ పార్టీ నిర్వహిస్తోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు.

Also Read: Harish Rao: రైతుల వడ్ల కొనుగోలులో రేవంత్‌ రెడ్డి ఫెయిల్‌: హరీశ్ రావు

సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని గులాబీ దళం అంచనా వేస్తోంది. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టమ్‌ను ఉంచారు.

బహిరంగ సభ వివరాలు
మొత్తం విస్తీర్ణం: 1,213 ఎకరాలు
సభా ప్రాంగణం: 154 ఎకరాలు. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ఏర్పాటు
పార్కింగ్‌: 1,059 ఎకరాలు. పార్కింగ్‌ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్ల నియామకం

వేసవి నేపథ్యంలో జాగ్రత్తలు
10 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
వేసవి నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో అత్యవసర వైద్య బృందాలు ఉండనున్నాయి. ఆయా రూట్లలో 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు.
1,200 తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News