KCR Emotional On Maganti Death: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక పార్టీ అధినేత కేసిఆర్ మాగంటి మృతి పై తీరని లోటు అంటూ ప్రకటించారు. ఆయన మరణానికి చింతిస్తున్న అంటూ సంతాపాన్నితెలియజేశారు.
పార్టీకి తీరని లోటు..
ఆయన మృతి పై పలువురు నాయకులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాగంటి లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు. ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటున్నాము. సౌమ్యుడు అంచలంచెలుగా ఎదిగిన మాగంటి ప్రజా నేతగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అంటూ ప్రకటించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు తన తరఫున సానుభూతిని తెలిపారు కాపాడు మాగంటిని కాపాడుకో వైద్యులు చేసిన కృషి పార్టీ తరఫున అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు ఇక మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు
ఇక మాగంటి ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో ఉదయం 5: 45 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఈనెల 5న ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. వెంటిలేటర్ పైన చికిత్స అందించారు, త్వరగా కోలుకొని తిరిగి వస్తారని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది.
ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సీఎం రేవంత్ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గోపీనాథ్ మరణం బాధాకరణమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేవారని కేటీఆర్, హరీష్ రావు కూడా గుర్తు చేసుకున్నారు.
ఈరోజు సాయంత్రం 3 గంటలకు అంతిమయాత్ర..
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగంటి మృతి పై తీవ్ర సంతాపం తెలియజేశారు. మంచి నాయకుడిని కోల్పోయాం అంటూ ప్రకటించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్, హరీష్ రావు మాగంటిని పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు మహాప్రస్థానంలో ఇవాళ సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ర్యాలీగా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అందరూ సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పారు.
Also Read: Glowing Skin: మెరిసే ముఖానికి ఈ 5 ఫేస్ మాస్కులు వేయాల్సిందే..
Also Read: తేనెతో ఈ మాస్క్ జుట్టుకు వేయండి.. పట్టులా మెరుస్తూ పెరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









