)
KCR Deeksha Divas: 'అహింసా మార్గంలో గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకు రావడం ఒక చరిత్ర. 1969లోనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ ఏర్పడింది' అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. తెలంగాణ సాధించాలనే సంకల్పం, చిత్తశుద్దితో కేసీఆర్ పోరాడారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన రాష్ట్రం తెలంగాణ సాధించుకోవాలనే తపనతో కేసీఆర్ పోరాడారని వివరించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ కీలక ప్రసంగం చేశారు. 'అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించారు కేసీఆర్. కేసీఆర్ పుణ్యంతోనే అనేకమందికి పదవులు... అవి కేసీఆర్ భిక్ష. కేసీఆర్ నిర్మించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్లో ఎలా ఉంటున్నారు?' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు.
'పేదల ఆకలి తీర్చాలని అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభిస్తే ఇందిరా క్యాంటీన్లుగా మార్చారు. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పేరుతో పంచుతుంది. మీరు ఇప్పుడు ఎక్కిన గద్దెలు, పదవులు కేసీఆర్ భిక్ష అని మర్చిపోకండి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చురకలు అంటించారు. కేసీఆర్ ప్రాణత్యాగానికి పాల్పడితే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. 'మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే కావాలి అంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు చేసుకున్నాం. కేసీఆర్ మళ్లీ రావాలి.. అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ ఒక చరిత్ర. మాయమాటలు, మోసం హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్నింటా విఫలమైంది' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook