KCR Vicharana: కాళేశ్వరం విచారణకు గులాబీ బాస్.. బీఆర్ఎస్ నేతల్లో హై టెన్షన్..

KCR Vicharana:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు రేపు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ విచారణకు హాజరుకానున్నారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 10, 2025, 11:03 AM IST
KCR Vicharana: కాళేశ్వరం విచారణకు గులాబీ బాస్.. బీఆర్ఎస్ నేతల్లో హై టెన్షన్..

KCR Vicharana:  కాళేవ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి బీఆర్‌కే భవన్‌ వద్దకు రావడం..అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతోపాటు మాజీ ప్రజాప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్‌ నుంచి సందేశం పంపినట్లు సమాచారం. 

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు నిన్న మాజీ మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. విచారణ అనంతరం హరీష్‌రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కువెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈటల, హరీశ్‌ను అడిగిన ప్రశ్నలను ఆరా తీసిన కేసీఆర్‌.. బుధవారం తనను ఏమేం అడుగుతారన్న దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కమిషన్‌ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి? జవాబు ఎలా చెప్పాలన్నదానిపై హరీశ్‌తో సమాలోచనలు చేసినట్లు సమాచారం.

Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..

Also Read:  ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News