Kishan Reddy Vs Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బాధ్యతారహితంగా, వాస్తవాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. . రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపులో తనపై చేసిన నిరాధా ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ గెలుపు కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాజకీయాలు చేయెద్దని హితువు పలికారు. దేశం, రాష్ర్టం అభివృద్ధి చేయాలనేదే తమ నినాదమన్నారు. హైదరాబాద్ 150 కార్పొరేషన్లలో 50 శాతం బీసీ లకు కేటాయించిన సీట్లలో 30 సీట్లలో నాన్ బీసీలు గెలుచుకొని లబ్ధి పొందుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలంటే వారికి జనాభా ప్రాతిపదికన హక్కులు రావాలని బీజేపీ పోరాడుతుందన్నారు. ఇది సీఎం రేవంత్ అసలు స్వరూపమని మండిపడ్డారు.
సీఎం రేవంత్ కేవలం అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. తాను తెలంగాణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు. గత పదేళ్లుగా అనేక కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ర్ట ప్రభుత్వం సహకారం అందించకపోవడం వల్ల అమలు చేయలేదన్నారు. పంటలబీమా, ఆయుష్మాన్ భారత్, ఎంఎంటీఎస్ వంటివి ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న వందరోజుల్లో ఆరు గ్యారంటీలు, 320 సబ్ గ్యారంటీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై ఎదురుదాడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లాడుతున్న విధానంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ, తనను బ్లాక్ మెయిల్, బీజేపీని బెదిరించినంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. నేడు తెలంగాణ సమాజం ఆయన మాటలు వినే పరిస్థితి లేదన్నారు.దిగజారుడు ఆరోపణలు..అనేక హామీలకు నమ్మి ఓటేస్తే ఏది అమలు చేయలేదని ఏ సామాజిక వర్గం సీఎం రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితులు లేవన్నారు. పెద్ద గొంతుతో మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. మొత్తంగా తెలంగాణ నీ అయ్య జాగీరు కాదంటూ కాస్తంత ఘాటుగానే స్పందించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర కార్యాలయాలు, విద్యాలయాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి వివరించి అభివృద్ధిని నిర్ణయం తీసుకున్నామన్నారు.
తనమీద తప్పు రుద్దితే ఊరుకునేది లేదు..
దేశంలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు వస్తే ఒకటి తెలంగాణకు ఇండస్ట్రియల్, కోచ్ ఫ్యాక్టరీ, రీజినరల్ రింగ్ రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులను తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తాను ప్రాధాన్యతనిస్తానన్నారు. అంతేగానీ ప్రాజెక్టులు అడ్డుకోవడం లాంటివి కూడా ఊహించడం తప్పే అవుతుందన్నారు. తాను చిన్నప్పటి నుంచి అయినా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేవాడినన్నారు. నీలాంటి తాటాకు తప్పుళ్లకు భయపడబోనన్నారు. తనమీద తప్పు రుద్దితే ఊరుకోబోనన్నారు. దేశం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు వాటికి కట్టుబడి ఉండి వాటిని అమలు చేస్తామని అన్నారు.
ప్రజల సర్టిఫికెట్ చాటు.. సీఎం సర్టిఫికెట్ అవసరం లేదు..
తనకు రాసిన లేఖలో రూ. 1,66,569.31 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదన్నారు. మరీ రాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారో? చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పెట్టిందా? అని నిలదీశారు. సీఎం మాటలకు అధికారులే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం ఇచ్చిన వివరాలను ఆయా మంత్రులవారీగా విభజించి జనవరి 23, నితిన్ గడ్కరీ, అశ్వనీ వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్ లకు పంపించామన్నారు. ఇంత పద్ధతి ప్రకారం తాము పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మెట్రో అలైన్ మెంట్ మార్చారు.. రూ. 317 కోట్లకు పెంచారు..
రాష్ర్ట ప్రభుత్వ నిధులతో ఫేజ్ 2 రింగ్ రోడ్డును నిర్మించుకుంటామని అన్ని పత్రికల్లోనూ యాడ్ లు కూడా ఇచ్చారన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇన్ని లోపభూయిష్ట విధానాలకు పాల్పడుతూ తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2 ఫేజ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. సీఎం రేవంత్ రాగానే కేంద్రానికి లేఖ రాసి మెట్రో సమగ్రంగా లేదని 2024 జనవరి 4న ఢిల్లీకి హర్దిప్ సింగ్ పూరిని కలిసి కొత్త ప్రతిపాదన విషయాన్ని తెలిపారన్నారు. 2024 అక్టోబర్ 26 వరకు కూడా రాష్ర్ట ప్రభుత్వం ప్లానింగ్, ప్రణాళిక కేంద్రానికి అందలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 234 కోట్లతో ప్రతీ కిలోమీర్ కు, 76 కి.మీ. పొడవుతో ప్రతీ కిలోమీటర్ కు రూ. 317 కోట్లకు పెంచుకుందాన్నారు. తొలిదశలో ఫలక్ నుమా వరకు అయ్యే ఖర్చులో కేంద్రం రూ 1200 కోట్లు మెట్రోకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన వస్తే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాక కేబినెట్ లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మీకే పది నెలలు పడితే ఏ ప్రాతిపదికన కేంద్రం, బీజేపీ, కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో చేపట్టే ఏ ప్రాజెక్టును ఆలస్యం, అడ్డుకునే అవకాశమే లేదన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అన్ని పనులు సకాలంలో జరుగుతాయన్నారు.
ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకతపై ఆంధ్రలో స్వతంత్రంగా బీజేపీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలుపుతామని ఆ విషయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముస్లింలకు ఇప్పకే ఈబీసీ రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించడం ఏ రకంగా తప్పు అవుతుందో? సీఎం రేవంత్ చెప్పాలని నిప్పులతో కడిగి పారేసారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









