
Komati Reddy Raj gopal reddy sensational comments on Revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొంత మంది సొంత పార్టీ నేతల వ్యవహరం పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ కు కవిత అంశం పెద్ద రచ్చగా మారిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొన్నినెలల క్రితం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తు పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా కోమటిరెడ్డి వ్యవహరం గత పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
ఇప్పటికే కోమటి రెడ్డి అనేక పర్యాయాలు తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తానంటేనే కాంగ్రెస్ లోకి మారినట్లు చెప్పారు. కొంత మంది తనకు పదవి రాకుండా పుల్లలు పెడుతున్నారన్నారు. మరోవైపు మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తానన్నారు. తనపై కొంత మంది పార్టీ మారుతున్నానని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గుప్పించారు.
మరోవైపు ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని సంచలనవ్యాఖ్యలు చేశారు. తాను ఏంమాట్లాడిన కొంత మంది వివాదాస్పదంగా చేస్తున్నారన్నారు.
ఇటీవల నిరుద్యోగులకు అండగా ఉంటున్నట్లు చేసిన వ్యాఖ్యల్ని సైతం కావాలని వక్రీకరించారన్నారు. తాను ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
అదే విధంగా తాను ఏపీలో వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసినట్లు వార్తల్ని కూడా ఖండించారు. అదే విధంగా
తాను కేవలం.. దుర్గమ్మ దర్శనం, ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసమే ఆంధ్రప్రదేశ్ వచ్చానని కూడా స్పష్టం చేశారు.
తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, మరే ఇతర పార్టీ మారనని చెప్పారు. అదే విధంగా కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook