Jana Reddy: జానారెడ్డి ధృతరాష్ట్రుడు.. ఆయనో దుర్మార్గుడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Komatireddy Rajagopal Reddy Slams To Jana Reddy: మంత్రి పదవుల భర్తీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలం రేపుతుండగా.. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని ధృతరాష్ట్రుడు అని విమర్శించడం సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 13, 2025, 03:54 PM IST
Jana Reddy: జానారెడ్డి ధృతరాష్ట్రుడు.. ఆయనో దుర్మార్గుడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Komatireddy Rajagopal Reddy vs Jana Reddy: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని.. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడగడం బాధేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని.. సామర్థ్యం బట్టి వస్తుందని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న జానారెడ్డి ధృతరాష్ట్రుడు లాంటోడని రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది.

Add Zee News as a Preferred Source

Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఓ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి అంశంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది' అని పేర్కొన్నారు. 'ఒకాయన అంటాడు ఒక ఇంట్లో ఇద్దరి మంత్రి పదవులు ఎలా ఇస్తారు? అని. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెట్‌లో యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిథ్యం వహిస్తే లేనిదే మంత్రి పదవులు ఇద్దరు ఇస్తే తప్పా' అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Kancha Gachibowli: సల్మాన్‌ ఖాన్‌లాగా మూడు జింకలు చంపిన రేవంత్‌ రెడ్డిపై చర్యలు ఏవి?

మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది.. కాదు కెపాసిటిని బట్టి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డిపై స్పందిస్తూ.. '30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చింది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చినా ఎంపీలు గెలవలేదు. భువనగిరిలో ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించా' అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించుకున్నారు.

'కేసీఆర్‌ను గద్దె దింపాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. కేసీఆర్‌ను గద్దె దింపిన అది నా కమిట్‌మెంట్‌' అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వివరించారు. 'నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు జానా రెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు' అని మండిపడ్డారు. 'రాజగోపాల్ రెడ్డి అంటే గల్ల ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే పొజిషన్లో ఉండడు' అని పునరుద్ఘాటించారు.

ఏం జరిగింది?
మంత్రి పదవుల భర్తీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చిచ్చు రేపింది. మంత్ర పదవి అర్హుల జాబితాను సేకరిస్తుండగా.. పలువురిని అధిష్టానం ఎంపిక చేయగా.. నడిమధ్యలో జానారెడ్డి కల్పించుకుని మంత్రి పదవుల భర్తీలో అధిష్టానానికి తన అభిప్రాయం చెప్పి ముఖ్యంగా తన సొంత జిల్లా నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అతడికి మంత్రి పదవి ఇవ్వరాదని చెప్పారని చర్చ జరుగుతోంది. దీంతో జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. జానారెడ్డి పేరు ప్రస్తావిస్తూ అతడు ఒక దృతరాష్ట్రుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News