Komatireddy Rajgopal Reddy: ఏం రా! ఇది విన్నావా? మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఏదో మంచి పని చేశారట..అన్నాడు సురేశ్. చేతిలో చాయ్ కప్పు పట్టుకుని సిప్ చేస్తూ అడిగాడు.
అవునా? ఈసారి ఏమి చేసారూ? అని ఆసక్తిగా అడిగాడు రమేశ్.
బెల్ట్ షాపులు అన్నీ మూయించేశారు అంటున్నారు. ఊర్ల మధ్యలో వైన్స్ షాపులు ఉండకూడదని చెబుతున్నారు. ఊరి అవతల పెట్టమని ఆదేశించారట. ప్రజల మంచికే కదా! అని అందరూ పొగుడుతున్నారు అని సురేశ్ చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు. మునుగోడు పట్టణంలో ఉదయం వేళ.. ఓ టీ స్టాల్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన సంభాషణ ఇది. టీ సిప్ చేస్తూ.. అవును రా! ఇంత ధైర్యంగా ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రజల బాగోగుల కోసం ఎప్పుడూ ముందుండే నేతే అలా చేస్తాడు.
అదే నిజం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పగానే ప్రజలు ఎంతో ఆదరిస్తుంటారు. ఆయన గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతుంటారు. రాజకీయంగా ఎంత ఎదిగినా, వ్యాపారాల్లో ఎన్ని విజయాలు సాధించినా.. ఆయనకు ప్రజల మధ్య ఉన్న అనుబంధం మాత్రం అసలేమీ తగ్గలేదనే చెప్పాలి. ప్రజల కష్టాలు చూసి స్పందించి.. వారి బాధలను తనవిగా భావించే నాయకుడిగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి.
మద్యం దుకాణాలు గ్రామాల్లోని ప్రజల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలుసుకున్న ఆయన, బెల్ట్ షాపులను తొలగించేందుకు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైన్స్ ఊరి మధ్యలో కాకుండా,ఊరి అవతల ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు వేసిన వారికే రాజగోపాల్ రెడ్డి టెండర్లు వేశారని చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో మునుగోడు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. తల్లిదండ్రులు, మహిళలు, యువత అందరూ తమ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కానీ రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు కేవలం మద్యం నియంత్రణే కాదు.. అభివృద్ధి పట్ల ఆయనకున్న కట్టుబాటు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మునుగోడు ప్రాంతంలో రోడ్లు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు, విద్యుత్ కనెక్షన్లను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడూ నేరుగా అధికారులను సంప్రదించి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంటారు.
నీటి సమస్యల పరిష్కారం, పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాలు ... ఇవన్నీ ఆయన ఆలోచనల్లో భాగమనే అని చెప్పాలి. అధికారం, పదవులకోసం కాకుండా, ప్రజల కోసం పని చేయాలనే దృఢ సంకల్పంతో రాజగోపాల్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. పదవి ముఖ్యం కాదు, ప్రజల మనసు గెలవడం ముఖ్యం అని ఆయన పలుమార్లు చెప్పారు.
రాజకీయ ఒత్తిళ్లు, పార్టీ మార్పులు, విమర్శలు వచ్చినా .. ఆయన పనితనం ఏనాడూ ఆగలేదు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌పై చేసిన వ్యాఖ్యల్లో కూడా ఆయన నిష్కపటంగా “నాకు పదవులు కావు, మునుగోడు అభివృద్ధి కావాలి” అని చెప్పడం.. ఆయన ధీటైన మనసును చూపిస్తుంది. ప్రజలు ఆయనను “మనసున్న నేత” అని ఎందుకు అంటారో అక్కడే అర్థమవుతుంది.
మునుగోడు ప్రాంతంలో చాలా గ్రామాలు ఆయన చర్యల వల్ల కొత్త రూపం దాల్చాయి. రహదారులు విస్తరించాయి. విద్యుత్ సరఫరా మెరుగుపడింది. పంచాయతీ భవనాలు నిర్మించారు. ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి నేత మునుగోడు ప్రజలకు దొరకడం మన అద్రుష్టమని సురేశ్ అంటుంటే.. అవును ప్రజల కోసం నిజంగా పనిచేసే నేత ఎక్కడ దొరుకుతాడు అని రమేశ్ అంటాడు. “అందుకే రా, మునుగోడు ప్రజలు ఆయనను వదులుకోవడంలేదు. రాజగోపాల్ గారు ఉంటే మన ఊరికి అభివృద్ధి హామీ! అంటూ ఆ ఇద్దరు యువకులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









