konda surekha controversy comments on ministers: తెలంగాణ మంత్రికొండా సురేఖ తరచుగా ఏదో ఒక వివాదం రాజేస్తుంటారు. సమంత, చైతుల డైవర్స్ పై కామెంట్ల నుంచి ఈ లేడీ మంత్రి ప్రతిసారి ఏదో ఒక రచ్చతో వార్తలలో ఉంటున్నారు. వేముల వాడకు వెళ్లి.. అక్కడ స్వామి వారిని నైవేద్యం ఆలస్యమయ్యేలా చేశారని అప్పట్లో వివాదం చెలరేగింది.
మరోసారి ఏకంగా మంత్రి శ్రీధర్ బాబుకు.. తమ బంధువు కొడుకుకు ఐటీ జాబ్ ఇప్పించాలని స్టేజీ మీదనే అడిగిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా.. మంత్రి కొండా సురేఖ ఏకంగా ఫైళ్ల క్లియరెన్స్ లు, అనుమతులు మంజురు చేయడానికి చాలా మంది మంత్రులు డబ్బులు డిమాండ్ చేస్తారన్న మాటలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
రేవంత్ పాలనలో మంత్రుల వద్ద ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా ముడుపులు అందాల్సిందేనని స్వయంగా బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ!
"కాంగ్రెస్ అంటేనే అవినీతి" అని ఒప్పుకున్న మంత్రి. pic.twitter.com/nF6Csnfzpr
— BRS Party (@BRSparty) May 16, 2025
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల .. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరంగల్ కృష్ణ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి.
విద్యార్థినుల కోసం కొత్త భవనం నిర్మించాలని కలెక్టర్ నా దృష్టికి తెచ్చారు. ఇందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.4.5 కోట్లను కేటాయించేలా మంత్రి హమీ ఇచ్చారు. ఈ క్రమంలో.. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. కానీ తనకు అలాంటి వ్యక్తిత్వం కాదన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
మంత్రి వ్యాఖ్యలుపై సొంత పార్టీ నాయకులే సెటైర్లు వేసుకోవడంతో రచ్చగా మారింది.
కొండా సురేఖ క్లారిటీ..
తన మాటల్ని కొంత మంది కావాలని వక్రీకరించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను అన్నది గతంలో బీఆర్ఎస్ మంత్రులు ఉండగా చేసిన పనులని డ్యామెజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేసినట్ల స్పష్టం చేశారు.
నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదని.. . ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తానంటూ కొండా సురేఖ కీలక అంశాలు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter