)
Konda Surekha daughter Sushmita mass warning to cm revanth reddy: తెలంగాణలో ఒకవైపు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి కొనసాగుతుంది. అన్నిపార్టీలు ఇప్పటికే బరిలో తమ తమ పార్టీ అభ్యర్థులు పేర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ లో మాత్రం సొంత పార్టీకి చెందిన మంత్రుల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా దేవాదాయ, అటవీ శాఖ మాత్రం కొండా సురేఖ వివాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై విరుచుకు పడ్డ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత
సీఎం, కాంగ్రెస్ మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్… pic.twitter.com/HLp6RFueeT
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2025
కొండా సురేఖ ఇటీవల తనను కొంత మంది రెడ్డి మంత్రులు టార్గెట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఇటీవల సీఎం రేవంత్ పర్యాటనకు కూడా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి వేళ హైదరాబాద్ లోని కొండా సురేఖ నివాసం దగ్గర హైడ్రామా నెలకొంది. ఇటీవల ఓఎస్డీ గా పనిచేస్తున్న సుమంత్ ను ప్రభుత్వం తొలగించింది.
అయితే.. సుమంత్ కొండా సురేఖ నివాసంలో ఉన్నాడన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకొవడంతో హైడ్రామా నెలకొంది. సుమంత్.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని డబ్బుల ఇవ్వాలని గన్ పెట్టి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐజీకి ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతుంది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో.. కొండా సురేఖ కూతురు సుస్మిత రెడ్డి పోలీసులతో వాగ్వాదంకు దిగారు. అదే సమయంలో..కొండా సురేఖ సుమంత్ లు బైటకు వచ్చి ఒకే కారులో బైటకు వెళ్లిపోయారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొండా సురేఖ వాగ్వాదంకు దిగారు. తమను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేంనరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారన్నారు.
ఇది కరెక్ట్ కాదు, మేము అన్ని పార్టీల్లో కొట్లాడాము కానీ.. సొంత పార్టీతో ఎప్పుడూ కొట్లాడలేదన్నారు. తమ జోలికి వస్తే.. సుమంత్‌కి మాత్రం ఏమైనా హాని జరిగితే మాత్రం ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని కొండా సుష్మిత రేవంత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో కొండా సురేఖ వ్యవహారం పెనుదుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook