Konda Surekha daughter sushmitha slams on revath reddy over osd issue: తెలంగాణాలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ వివాదం తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
సుమంత్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చామన్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. ఆ తర్వాత కొండా సురేఖ, సుమంత్ ను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటీ శ్రీనివాస్, వేం నరేందర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు
ఎంతమంది పోలీసులు వచ్చినా నన్నేం పీకలేరు - కొండా సుస్మిత https://t.co/ziddJ6iG5A pic.twitter.com/P3f6uzBkpQ
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2025
కొండా దంపతుల మీద కుట్రలు చేస్తున్నారన్నారు. బీసీ మంత్రుల్ని అణగతొక్కేందుకు ఈ విధంగా చేశారన్నారు. మరోవైపు డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఒక మంత్రి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా.. పోలీసులు మాత్రం ఫిర్యాదు అందలేదని, ఆరోపణలపై విచారణకుమాత్రమే తాము వచ్చామన్నారు.
మరోవైపు.. సుస్మిత మాట్లాడుతూ తమ ఇంటి చుట్టు భారీగా బలగాలు ఉన్నాయన్నారు. అసలు ఆరోపణలు ఏంటనే విషయాలను కూడా పోలీసులు సరిగ్గా చెప్పడంలేదన్నారు. తాము కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తమకు పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. తాను కూడా ఎన్నో పోరాటాలు చేశానని విషయంను గుర్తు చేశారు.
కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరంలేదన్నారు. డబ్బులు, పదవులు శాశ్వతం కాదని, కార్యకర్తల కోసం కొండా కుటుంబం ఎల్లవేళల అండగా ఉంటుందన్నారు. పోలీసులు, రేవంత్ రెడ్డి, పొంగులేటీ బెదిరింపులకు వెనక్కు తగ్గేది లేదని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









