Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖా మరోసారి సంచలన ట్వీట్‌..!

Konda Surekha Tweet On Nagarjuna Family Viral: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గతంలో హీరో నాగార్జున ఆయన కుటుంబ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వారిని కించపరిచాలనేది తన ఉద్దేశం కాదు అని ఆమె రాసుకొచ్చారు. ఆ ట్వీట్ వైరల్ అవుతూ ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 

Written by - Renuka Godugu | Last Updated : Nov 12, 2025, 07:14 AM IST
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖా మరోసారి సంచలన ట్వీట్‌..!

Konda Surekha Tweet On Nagarjuna Family Viral: మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున పై మరోసారి సంచలన ట్వీట్‌ చేశారు.నాగార్జునను, తన కుటుంబాన్ని కించపరచాలనేది తన ఉద్దేశం కాదని ఆమె ట్వీట్‌ చేశారు. నాగార్జున ఆయన కుటుంబం పై గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మా అర్థరాత్రి 12 గంటల తర్వాత సంచలన ట్వీట్ చేశారు. వారు బాధపడితే అందుకు చింతిస్తున్నానని.. ఆ వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని కూడా ఆమె రాసుకోచ్చారు. ఈ సందర్భంగా ఆమె అర్ధరాత్రి 12 గంటలకు ట్వీట్‌ చేయడం చర్చకు దారితీసింది. కాగా మంత్రి సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు నడుస్తూ ఉంది. ఈ సమయంలోనే ఈమె సంచలన ట్వీట్‌ చేశారు.

Add Zee News as a Preferred Source

 

 

 ప్రధానంగా మంత్రి కొండ సురేఖ సమంత పేరు తీసుకువచ్చి నాగార్జున ఫ్యామిలీ పై సంచలన కామెంట్ చేశారు. అప్పట్లో అది పెద్ద రచ్చే అయింది. నాగచైతన్య సమంత విడాకుల పై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. దీనిపైన నాగార్జున వారి కుటుంబం ఖండిస్తూ పరువు నష్టం దావా వేశారు. 

కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. అక్కినేని కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారమే రేగింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. గౌరవ మంత్రివర్యులు మంత్రి కొండ సురేఖ గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన రాసుకోచ్చారు దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలను గౌరవించండి. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు వ్యాఖ్యలు చేయడం మా కుటుంబం పై మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అన్నారు.

 అయితే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆమె ఆరోపించింది. సినీ ఇండస్ట్రీలో ఆమెతోపాటు ఎంతో మంది హీరోయిన్‌లు డ్రగ్స్‌ వల్ల కెరీర్‌ నాశనం చేసుకున్నారని కూడా ఆమె మండిపడ్డారు. కేటీఆర్ డ్రక్స్‌ తీసుకుంటారని, ఆయన హీరోయిన్లకు కూడా డ్రగ్స్‌ అలవాటు చేశారనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. హీరో నాగార్జున పరువు నష్టం దావా కేసు నడుస్తున్న సమయంలో తాజాగా ఆ మాటల వెనక్కి తీసుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేసింది. అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత కొండా సురేఖ పెట్టిన పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేదా? అని నెటిజెన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

Read more:  విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్.. నవంబర్‌ 14 శుక్రవారం స్కూళ్లన్నీ బంద్‌..!

Read more:  మరో ఘోర బస్సు ప్రమాదం.. విజయవాడ వెళ్తుండగా పూర్తిగా దగ్ధం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News