KT Rama Rao: తెలంగాణలో బ్రోకర్ల ప్రభుత్వం నడుస్తోంది. రేవంత్ రెడ్డి వెనుకాల నలుగురు బ్రోకర్లు ఉన్నారు. రూ.వందల వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి నలుగురు బ్రోకర్లతో తిరుగుతున్నారు' అంటూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: TGPSC Group 1 Results: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోవడం ఇలా
'రూ.వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో తిరుగుతున్న రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దాసోజు శ్రవణ్‌కుమార్‌కు మద్దతుగా అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియాతో ఇష్టోగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేము విచ్చలవిడిగా భవన అనుమతులు ఇవ్వలేదు. అది ఇచ్చింది, ఎఫ్‌ఎస్‌ఐ తీసుకొచ్చింది వైఎస్సార్' అని వివరించారు.
Also Read: IPL Match Tickets: ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లపై వివాదం.. హెచ్‌సీఏ క్లారిటీ ఇదే!
'రాష్ట్ర రెవెన్యూ పెంచే ప్రయత్నం చేయరు. డబ్బులు ఎలా కాపాడుకోవాలో రేవంత్ రెడ్డికి తెలిసినంత దేశంలో ఏ ముఖ్యమంత్రి కి తెలియదు' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇసుక దందా భారీగా జరుగుతోందని.. టీడీఆర్ విషయంలో మాసివ్ లూట్ జరుగుతోందని ఆరోపణలు చేశారు. 'ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇందిరమ్మ గ్యారంటీ, కార్డులు, జారీ చేశారు. ఒక్క హామీకి దిక్కులేదు' అని విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారు. కేసీఆర్ స్థాయి వేరు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు.. పనికిమాలిన మాటలు.. కారు కూతలు వినకూడదు అనేది ఆయన ఆలోచన. ఈ పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి ఒక కొడుకుగా.. ఒక పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ రావొద్దు అనేది నా అభిప్రాయం' అని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









