SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై రేవంత్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాడని.. దీనికితోడు చిట్‌చాట్‌ల పేరిట చిల్లరమల్లర వ్యాఖ్యలు చేయడం సరికాదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ధనదాహం వల్లనే ఎస్‌ఎల్‌బీసీఓ 8 మంది కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. తన అసమర్ధతను.. పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని విమర్శించారు.
Also Read: Harish Rao: 'తెలంగాణలో బంగారం లాంటి పంటలకు కారణం ఒకే ఒక్కరు కేసీఆర్'
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం అని ఎద్దేవా చేశారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిపారు.
Also Read: Revanth Reddy Chit Chat: 'రాత్రికి రాత్రి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయలేం'
కార్మికులు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందని.. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో తెలంగాణకు మంచి జరిగేలా ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు.
ఛీఫ్ మినిస్టర్‌గా మాట్లాడాలి కానీ ఒక చీప్ మినిస్టర్‌గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అధికారంలో తానున్నది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కావాల్సిన విచారణలు దర్యాప్తులు చేసుకోవచ్చు' అని కేటీఆర్ సవాల్ చేశారు.
'టైంపాస్ చేసేందుకు పరిపాలనను పక్కనపెట్టి చేతకాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టారు. రూ.6,500 కోట్లు కేవలం వడ్డీ లెక్క అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదు' అని రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









