Save HCU Movement: 'తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హెచ్‌సీయూ' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి హెచ్‌సీయూ భూములపై రేవంత్ రెడ్డి రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపై యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నది. వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లు, జంతువులు చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఆరాటపడుతున్నదో చెప్పాలి' అని కేటీఆర్ నిలదీశారు.
Also Read: HCA SRH Dispute: సన్‌రైజర్స్ వార్నింగ్‌పై రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'హెచ్‌సీయూ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇది. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం.. విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం చాలా గొప్పది' అని కొనియాడారు. యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు.
Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు ఇప్పట్లో కష్టమే? కొన్నాళ్లు ఆగాల్సిందే!
'గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. ఒక కాంక్రీట్ జంగల్‌గా మారింది. పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే. పశ్చిమ హైదరాబాద్‌లో భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి' అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 400 ఎకరాలను విక్రయించే ముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభావం పైన అధ్యయనం చేయాలి అని అడుగుతున్నారు
'2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించింది. కేవలం స్టేడియాలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నది' అని కేటీఆర్ వివరించారు.
భూములను అమ్మి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే ఎజెండాపై ప్రజలు నిర్ణయిస్తారు' అని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే వేల ఎకరాల భూమి మీకు అందుబాటులో ఉన్నప్పుడు 45 వేల ఎకరాలను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. '400 ఎకరాలపైన ఎందుకు ఇంత దారుణంగా దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. అడ్డమొచ్చిన విద్యార్థులను ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసశానుడి మాదిరి వ్యవహరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









