Pink Tsunami In Telangana: రజతోత్సవం చేసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎల్కతుర్తి సభతో చరిత్ర సృష్టించబోతున్నదని.. తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు రాబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: Vijay Deverakonda: 'ఆ నా కొడుకుల్ని'.. పాకిస్థాన్‌పై హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక రజతోత్సవ సభకు సంబంధించి శనివారం కేటీఆర్ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు, ఎల్కతుర్తి బహిరంగ సభకు తరలివెళ్లడంపై పార్టీ నాయకత్వానికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలిరావాలని నాయకులకు సూచించారు.
Also Read: BRS Party: కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. తెలంగాణ చూపు ఎల్కతుర్తి వైపు
పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో, సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని గుర్తుచేశారు. ప్రజలందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని కేటీఆర్ చెప్పారు. ఎండలతో ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో తాగునీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని స్పష్టం చేశారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని పార్టీ శ్రేణులకు చెప్పారు. నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









