BRS Party Silver Jubilee Celebrations: మోసపూరిత రేవంత్ రెడ్డిని నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోం. అతడిని నమ్మడం వలన రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీలతో ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు. కానీ పదేపదే మోసపోతే అది మన తప్పు అవుతుంది. ఈసారి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’ అని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: Jana Reddy: జానారెడ్డి ధృతరాష్ట్రుడు.. ఆయనో దుర్మార్గుడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహాక సమావేశంలో మల్కాజిగిరిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హాజరై కీలక ప్రసంగం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని సూచించారు. ఒకే తప్పును మళ్లీ చేయొద్దని.. జీహెచ్‌ఎంసీతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ
'రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రేవంత్ పాలనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలకు బుద్ధిచెప్పే సమయం అని ప్రజలకు గుర్తుచేశారు. ఎన్నిక ఏదైనా.. సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వివరించారు.
'తెలంగాణ ఆత్మ.. స్వాభిమానం కాపాడాలంటే.. నలుగురికి భరోసా కలిగించే పార్టీ ఒక్కటే అది బీఆర్‌ఎస్’ అని కేటీఆర్ వెల్లడించారు. వరంగల్‌లోని ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులతోపాటు ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









