KTR: లగచర్ల ఆడబిడ్డలకు సారీ చెప్పి రేవంత్‌ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి: కేటీఆర్‌

KTR Slams To Revanth Reddy On Lagacharla NHRC Report: సిగ్గు,శరం ఉంటే దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రేవంత్ రెడ్డి అవన్నీ లేకనే సీఎంగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 22, 2025, 06:43 PM IST
KTR: లగచర్ల ఆడబిడ్డలకు సారీ చెప్పి రేవంత్‌ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి: కేటీఆర్‌

KT Rama Rao: భూములను స్వాధీనం చేసుకునే పేరిట లైంగిక వేధింపులకు పాల్పడిన రేవంత్‌ రెడ్డి లగచర్ల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేశారు. క్షమాపణ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు. దళిత గిరిజన ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, హింసను మానవ హక్కుల కమిషన్ తేల్చిన నేపథ్యంలో బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కోరారు.

Add Zee News as a Preferred Source

Also Read: UPSC Final Results: యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. ర్యాంకులు చెక్‌ చేసుకోవడం ఇలా!

హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌ను మంగళవారం రేవంత్‌ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల బాధితులు కలిశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎన్‌హెచ్చార్సీ నివేదికతో అయినా సిగ్గు తెచ్చుకుని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారని తెలిపారు. రేవంత్ రెడ్డి సిగ్గు,మానం ఏమాత్రం లేకపోవడంతో ఇంకా సీఎంగా కొనసాగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: K Kavitha: 'తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' గులాబీ శ్రేణులకు కవిత పిలుపు

అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. మళ్లీ బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఏ మూలలో దాక్కున్నా  పట్టుకొచ్చి హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామని హెచ్చరించారు. 

ఒక మనిషిని ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవధ  చేసే అవకాశం ఉంటదో అన్ని రకాలుగా లగచర్ల గిరిజనులను పోలీసులు హింసించారని మాజీ మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. దారుణాతి దారుణంగా కిరాతకంగా మానవ మృగాల మాదిరి లెక్క రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ముఖ్యమంత్రి, కొడంగల్ ఎమ్మెల్యే, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని కేటీఆర్‌ చెప్పారు. 'ఇజ్జత్‌ ఉంటే హోంమంత్రిగా పోలీసులు దౌర్జన్యానికి ముక్కు నేలకు రాయాలి. సిగ్గు, శరం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి' అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

'లగచర్ల అంశంలో రేవంత్ రెడ్డి, ఆయన అన్న  తిరుపతిరెడ్డి పాత్ర లేకపోతే  ఓవరాక్షన్ చేసిన పోలీసులను సర్వీస్ నుంచి  డిస్మిస్ చేయాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News