KTR Speech In Bengaluru: నూతన సాంకేతిక పరిజ్ఞానాలు ఎంత వచ్చినా.. ఎన్ని మారినా మానవ వినియోగం అనేది మారదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని పేర్కొన్నారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం తప్పదని హెచ్చరించారు. 'డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి వాడుకోవచ్చు. యుద్ధానికి వాడుకోవచ్చు. దేనికి వాడాలో మనమే నిర్ణయించుకోవాల్సి' అని చెప్పారు. అందరికీ సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) లేకుంటే అందరికీ సమాన అవకాశాలు అందించలేమని స్పష్టం చేశారు. 'దేశంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ జూదం ఘోరాలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేం' అంటూ కేంద్రం చేస్తున్న చర్యలను కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు.
Also Read: KT Rama Rao: 'రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఎస్‌ఎల్‌బీసీలో 8 మంది ప్రాణాలు గాల్లో'
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం నిర్వహించిన ఎంట్రప్రెన్యూర్ టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'టెక్నాలజీ ప్రపంచాన్ని మలచడంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేలా కొత్త ఆవిష్కరణలు సాగాలి. సాంకేతికత అభివృద్ధి కావాలి, కానీ అది సమాజానికి మేలు చేయాలి' అని తెలిపారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని.. కానీ ప్రతి సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read: Harish Rao: 'తెలంగాణలో బంగారం లాంటి పంటలకు కారణం ఒకే ఒక్కరు కేసీఆర్'
'ఆర్టిఫిషీయల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్), ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ (ఐఓబీ) వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని మార్చగలవు. రేడియోలు మాయమై టీవీలు వచ్చాయి. ఇప్పుడు పాడ్‌కాస్టుల హవా. ఫార్మాట్ మారుతుండొచ్చు కానీ మానవ అవసరాలు ఎప్పటికీ మారవు' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరమవుతుందని హెచ్చరించారు. 'భవిష్యత్తు నిర్మాణం అంటే కేవలం రేపటి రోజుల్లో జీవించడం కాదు రేపటిని నిర్మించడం' అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలని సూచించారు.
అది ప్రమాదకరం
'డ్రోన్స్ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చగలవు.. అదే డ్రోన్స్ విధ్వంసానికి ఉపయోగిస్తే అది ప్రమాదకరం. అందుకే ప్రతి టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంతో పెనువేసుకుంటున్న కొద్ది.. సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు ఆలోచించాలి' అని కేటీఆర్ వివరించారు.
వాటిపై ఎవరూ దృష్టి
'ప్రతి రోజూ భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి విద్యుత్, వాటర్ వినియోగంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. టెక్నాలజీతో పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకు వెళితే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ఐఓటీ, మోబైల్ యాప్‌లు, డేటా స్టోరేజ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ, అవి ఎంతగా పర్యావరణ భంగాన్ని కలిగిస్తున్నాయో ఆలోచించాలి' టెక్ నిపుణులకు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









