Petrol And Diesel Price Hike: ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా మోదీ ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచిందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గాల్సిందిపోయి పెరుగుతున్నాయని మండిపడ్డారు. తాజాగా పెంచిన ధరలు అసాధారణమని పేర్కొన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో నిత్యవసరాల ధరలు, రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: KT Rama Rao: 'తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్ పార్టీలు బీఆర్‌ఎస్.. టీడీపీ మాత్రమే'
హైదారాబాద్‌లో మంగళవారం మాజీమంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై స్పందించారు. 'బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా? ఎన్నికల ముందు మాత్రమే రేట్లు తగ్గించినట్లు ప్రకటనలు చేసుకుంటారు. మోడీ ప్రభుత్వం ధరలను పెంచిన పేరు విచిత్రంగా ఉంది' అని కేటీఆర్ తెలిపారు. 'నిధులు కేంద్రీకృతమయ్యేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడంతోనే పన్నులు కాకుండా సెస్సుల రూపంలో ధరలు పెంచుతుంది' అని వివరించారు.
Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ
'రూ.రెండు చొప్పున సెస్ పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, 19 స్టాక్ మార్కెట్ విలువ తగ్గడం ఇవన్నీ కలిపి ఒకటే రోజు మోడీ హ్యాట్రిక్ కొట్టారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. కేంద్రాన్ని చెప్పగల శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి గాని ఆర్థిక మంత్రి కానీ ఎవరూ మాట్లాడడం లేదు. పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేసినా పెట్టడం లేదు' అని కేటీఆర్ వివరించారు.
అమెరికా పన్నులు.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజల ఆర్థిక సంపద కరిగిపోతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వంతో అనేక నష్టాలు జరుగుతున్నాయని.. అమెరికా పన్నులతో తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతున్నదన కేటీఆర్ జోష్యం చెప్పారు. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులయ్యే ఫార్మా, ఐటీ ఉత్పత్తుపై అమెరికా విధించిన పన్నులు తీవ్రంగా తెలంగాణకు నష్టం చేకూర్చబోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
'తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాల కు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పరిపాలన విధానాలతో జీఎస్టీ పెరుగుదల జీరో శాతంగా ఉంది. ష్ట్ర ప్రభుత్వం మద్యం వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాలలో ఆదాయం పెంచడంలో విఫలమైంది' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్ అని తెలిపారు. 'ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మసిటీ రద్దు, హైడ్రా బీభత్సం, మూసీ విధ్వంసం.. రేవంత్ రెడ్డి ఉంటే నెగిటివ్ పరిపాలన విధానాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఒక నెగెటివిటీ పెరిగింది' అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









