Revanth Reddy Mental Health Condition: బహిరంగ సభలో స్థాయిని మించి మాట్లాడిన రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పిచ్చి *క్కకు పరిస్థితి ముదిరిందని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించి అతడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!
కొలువుల జాతర పేరిట నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై దారుణ వ్యాఖ్యలు చేశారు. మార్చురీకి వెళ్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒకరి చావు కోరుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడింది. ఇక తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Also Read: BAC Meeting: అసెంబ్లీలో బార్స్.. వైన్స్.. బెల్ట్‌షాపులపై చర్చించాలి
'ఈ పిచ్చి *క్క కనీస విచక్షణ.. మర్యాదను దాటుతోంది. అతడి మానసిక ఆరోగ్య పరిస్థితి కుటుంబసభ్యులు ఆలోచించాల్సి ఉంది. లేకపోతే ప్రతి ఒక్కరినీ కరిచే అవకాశం ఉంది. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి' అంటూ కేటీఆర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.
This mad dog has crossed every single limit of decency
I request his family members to take him to some mental health facility at the earliest or else in his frustrated state, he might start biting everyone around
Get well soon #CheapMinister https://t.co/pL24i5dWxd
— KTR (@KTRBRS) March 12, 2025
మెచూరిటీ లేకనే మార్చురీ వ్యాఖ్యలు
మార్చురీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఖండిస్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ మెచ్యూరిటీ లేకనే మార్చురీ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. 'ప్రతిపక్ష నాయకుల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితికి నిదర్శనం. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారు' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
'పాలన చేతకాక రేవంత్ 'పరనింద''నే పనిగా పెట్టుకున్నారు. వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు. తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీఆర్‌ఎస్‌పై నెపం నెట్టి సానుభూతి రాజకీయానికి తెర లేపుతున్నారు. హంతకుడు సంతాప సభ పెట్టినట్టు ఉంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాష్ట్రానికి కేన్సర్ సోకిందంటూ రేవంత్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. తన చేతకాని తనాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధమాడకపోతే పూట గడవదు అనే పద్దతి లో రేవంత్ వ్యవహారం ఉంది. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి గారడీ మాటలు చెబుతున్నాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు మండిపడ్డారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తాను ఉన్నది సీఎం పదవిలో అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని చిల్లర వేషాలు మానితే మంచిదని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









