
KTR Speech In Telangana Assembly: 'తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలా?' అని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. అందాల పోటీల ఆవశ్యకత అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. అందాల పోటీ వలన వచ్చే ఉద్యోగాలు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 'దేశానికి గర్వకారణమైన అంబేడ్కర్ విగ్రహానికి తాళం వేసి బందీగా ఉంచింది. రూ.46 కోట్ల ఫార్ములా-ఈతో ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు తెస్తే తప్పా? రూ.55 కోట్లతో అందాల పోటీలు నిర్వహిస్తుంది' అని వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం రాత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర పర్యాటకం.. పెట్టుబడులు వంటి అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. 'రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాగునీళ్లు లేవు.. సాగునీళ్లు లేవు' అని కేటీఆర్ తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన పరిస్థితుల్లో అందాల పోటీలు నిర్వహించడంపై ధ్వజమెత్తారు. తాగు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం అందాల పోటీలకు ప్రాధాన్యత ఇవ్వడంపై కేటీఆర్ ప్రశ్నించారు.
అందాల పోటీల వలన ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఎట్లా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేసుని ఏకపక్షంగా మంత్రివర్గం ఆమోదం లేకుండా రద్దు చేయడంతో రాష్ట్రానికి రూ.46 కోట్ల నష్టం జరిగిందని గుర్తుచేశారు. 'ఫార్ములా-ఈ రేసుతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చాయి. జహీరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వెనకతల, మహబూబ్‌నగర్ వంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి' అని కేటీఆర్ వివరించారు.
పర్యాటక విధానంలో 99 ఏళ్లకు ప్రభుత్వ భూములు, ఆస్తులను లీజుకు ఇవ్వడం ఏ విధంగా న్యాయమని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు టూరిజం సర్కిల్లో పెట్టాలని లేదు. దానికి తాళాలు వేసి ఎందుకు ఉంచారో చెప్పాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 'కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు పర్యాటకాన్ని బాగా అభివృద్ది చేశాం. కానీ ఏం జరగలేదన్నట్టు జూపల్లి మాట్లాడుతున్నారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ వంటి అభివృద్ధి చేశాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
కాంగ్రెస్ పాలనలో..
ఫార్ములా ఈ రేసు ❌
అందాల పోటీలు ✅@KTRBRS pic.twitter.com/ocmZW2dOJO
— Thirupathi Bandari (@BTR_KTR) March 25, 2025
ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదు.. తాళాలు వేసి ఎందుకు బంధించారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/tyViwKFDoD
— BRS Party (@BRSparty) March 25, 2025
దేశంలో ఎక్కడా లేనివిధంగా సాంస్కృతిక సాంస్కృతిక సారథి ద్వారా 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ జీతాలు ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో అణచివేయబడిన తెలంగాణ భాషా, యాసను కాపాడుకునేందుకు తెలంగాణ యాస భాషకు ప్రాణప్రతిష్ట చేశామని కేటీఆర్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి