KT Rama Rao Letter: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసినా.. కీలక ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం వినిపించుకోకపోవడంపై కేటీఆర్ సంచలన లేఖ విడుదల చేశారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 'కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలి' అని పిలుపునిచ్చారు.
Also Read: Employees Holiday: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 'శృంగారం' కోసం 36 గంటల పాటు సెలవు
హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర భంగపాటు ఎదురైంది. న్యాయస్థానాలు కల్పించుకుని స్టే ఇవ్వడంతో మింగుడుపడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా హెచ్‌సీయూను అక్కడి నుంచి తరిమివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం అందింది. ప్రభుత్వం మరో తీవ్ర తప్పు చేస్తుండడంతోపాటు హెచ్‌సీయూ మనుగడకే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు లేఖ రాశారు.
Also Read: Bandi Sanjay: 'పాలనపై పట్టులేని రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి'
విద్యార్థుల ఉద్యమం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. '400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 'ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తున్నది' అని ఆరోపించారు.
ఈ సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థుల నిరసనకు మరోసారి కేటీఆర్ సలాం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 'విద్యార్థులపై అపవాదులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని ఫోర్త్ సిటీకి తరలిస్తామని హెచ్చరిక తప్పు అని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూని కాపాడుతామని పార్టీ నుంచి హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









