KT Rama Rao: ప్రమాదంలో 8 మంది ప్రాణాలు ఉంటే మంత్రులు చేపకూర విందులా?

KT Rama Rao Slams Ministers Fish Curry Dinner: ఎస్‌ఎల్‌బీసీలో 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉంటే అక్కడే పసందైన మాంసాహారం వండుకుని మంత్రులు తినడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఒకవైపు విద్యార్థులను పస్తుల్లో ఉంచుతూ విందులు చేసుకోవడాన్ని తప్పుబట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 28, 2025, 06:18 PM IST
KT Rama Rao: ప్రమాదంలో 8 మంది ప్రాణాలు ఉంటే మంత్రులు చేపకూర విందులా?

Ministers Fish Curry Dinner: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలి 8 మంది కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో మంత్రులు విందులు చేసుకోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా మంత్రులు వ్యవహరించడం దారుణంగా పేర్కొన్నారు. చేపలతో విందు తింటున్న మంత్రులు రాష్ట్రంలో విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో ఉండడంపై మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source

Also Read: Mamnoor Airport: తెలంగాణకు గుడ్ న్యూస్.. మామునూర్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

ఎస్‌ఎల్‌బీసీలో మంత్రులు చేసుకున్న విందుపై మాజీ మంత్రి కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఒక హాస్టల్‌లో భోజనం పెట్టకుండా గుడిలో తినమని చెప్పిన సంఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'విషాదంలో విందులా? హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం' అని విమర్శించారు.

Also Read: KT Rama Rao: కేటీఆర్‌ కీలక ప్రసంగం.. 'ఎంత ఏఐ వచ్చినా.. మానవ అవసరాలు ఎప్పటికీ మారవు'..

'"అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి 200 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్లి తినాలని.. రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేసిన హాస్టల్ సిబ్బంది' అని కేటీఆర్‌ వివరించారు.

'భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్లే ఓపిక లేక  విద్యార్థులు పస్తులు ఉన్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా.. అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏమిటి' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'పండగపూట విద్యార్థులను పస్తులు ఉంచడమే ప్రజాపాలనా? అని కేటీఆర్‌ నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News