KTR Arrested:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు కానీ అప్పుడే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అదానీ, రేవంత్ స్నేహం పై నిరసనలు తెలుపుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టీ షర్ట్లపై ప్రింట్ కూడా వేసుకున్నారు. ఈ క్రమంలోనే గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరగా.. గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ టీ షర్టు ధరించడంతోనే ఈ వ్యతిరేకత ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీషర్ట్ ఉంటే అసెంబ్లీలోకి అనుమతించమని ఎమ్మెల్యేలకు తెలిపారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ ని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇక వీరందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం.
ఇకపోతే పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అసెంబ్లీ గేటు ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభం అవ్వడంతో ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్ అనుమతితోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.. ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీ వాళ్లు పిలవకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిరసనలు మొదలయ్యాయి.
మరి దీనిపై అటు కేటీఆర్ తో తమ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపగా ఇప్పుడు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఇందిరా దేవి మిస్సింగ్.. కావ్యకు షాకింగ్ న్యూస్ చెప్పిన కల్యాణ్, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.