)
KTR vs Revanth Reddy: 'ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారు, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారు. కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అందుకే ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం కోర్టు ఆపిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక… ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని పేర్కొన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైకోర్టు స్టేతో 42 శాతం రిజర్వేషన్ల పేరిట రేవంత్ రెడ్డి ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరుతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాలరాసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మభ్యపెట్టేందుకు తెచ్చిన జీఓ న్యాయస్థానాల్లో నిలబడదని బీఆర్ఎస్ చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలిపోయిందని తెలిపారు.
కులగణన నుంచి జీఓ దాకా రేవంత్ రెడ్డి చేసినదంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు తాము అనేక సూచనలు చేశామని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆమోదం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా ధర్నా పేరిట నాటకమాడారని కేటీఆర్ తెలిపారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి 42 శాతం బీసీలకు పదవులు కట్టబెడతామని చెప్పి, పూటకొక మాటను కాంగ్రెస్ మార్చిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకున్నాక రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పిన అడ్డగోలు మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేశారని, చివరికి న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో మభ్యపెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం బయటపడిందని తెలిపారు. ఎన్నికలు వాయిదా వేసేందుకు బీసీ రిజర్వేషన్లను పావుగా వాడుకున్నారని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook