KTR: రేవంత్ ఓ మూర్ఖుడు.. నాకు అడ్డమైన లింకులు అంటగట్టాడు..సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు. తెలంగాణ జాతి పిత కేసీఆర్ ను నోటి కొచ్చినట్టు మాట్లాడుతూ తన స్థాయిని దిగజార్చుకున్నారు. నాకు అడ్డమైన లింకులు అంటకట్టాడు. రేవంత్ దూకిన గోడల వ్యవహారంపై మీడియాతో  పలు అంశాలను పంచుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 17, 2025, 12:06 PM IST
KTR: రేవంత్ ఓ మూర్ఖుడు.. నాకు అడ్డమైన లింకులు అంటగట్టాడు..సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

 KTR: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేసింది. దాన్ని అడ్డుకోవడానికి అప్పటి ఏపీ నేతలు ఆడిన డ్రామాలు .. ఇలా ఎన్నో పరిణామాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అందులో కేసీఆర్  పాత్రను ఎవరు కాదనలేరు. కష్టపడి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి నిజంగా ఓ పిచ్చోడు. సీఎం స్థాయిని దిగజార్చాడు.  నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటంతో తన స్థాయిని తాను తగ్గించుకన్నాడు. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి.. తన పాలనఅట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడనే విషయాన్ని ప్రస్తావించాడు. నోట్ల కట్టలతో నోటుకు ఓటు కేసులో దొరికి పోయిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఇక్కడ ప్రజలు చేసుకొన్న దురదృష్టమన్నారు. రూ. 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.‌. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవన్నారు.

Add Zee News as a Preferred Source

కుటుంబాలు మాకు లేవా. పిల్లలు మాకు లేరా? రేవంత్ కే ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నాకు అడ్డమైనవారితో ఏవేవో‌ లింకులు పెట్టాడు. మాకు ఫ్యామిలీలు లేవా వాళ్లు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్ లో దాటిన రేఖలను బయట పెట్టాలా అని ప్రశ్నించారు.  

పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారన్నారు. నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు. ఫస్ట్ ఇయర్ లో కూడా రేవంత్ రెడ్డి కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రేవంతే ఒప్పుకున్నాడు. సంపద సష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేనే లేదు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ గ్రాఫ్ పెరుగుతుందా.. ?  

కేంద్రంతో సఖ్యతగా  ఉండి.. నిధులు సాధిస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు  ఎంత తెచ్చాడు.కేసీఆర్ పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు. అడ్డమైన గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి పరిపాలనపై  పై దృష్టి పెడితే బాగుంటుంది.  పదిహేనేళ్ళగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటు. ఇలాంటి వారు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News