)
KT Rama Rao: భారత సైన్యంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి బాజాప్తా క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరం అని గుర్తుచేశారు.
'యూనిఫామ్ ధరించిన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే ప్రజలు సురక్షితంగా ఉంటూ రాజకీయాలు చేసుకోగలుగుతున్నాం. ఆర్మీ సరిహద్దుల్లో ఉండడం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాం మరియు కుటుంబాలతో జీవించగలుగుతున్నాం' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డికి సరికాదని హితవు పలికారు.
'తన వ్యాఖ్యలతో నీచమైన స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి, ఎన్నికల లబ్ధి కోసం ఆర్మీపై వ్యాఖ్యలు చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నాడు. భారత సైన్యాన్ని కించపరిచి పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారు?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భారత సైన్యానికి క్షమాపణ చెప్పి.. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు రౌడీషీటర్లు అంటేనే గౌరవం. అలాంటి రేవంత్ రెడ్డి శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదు' అని పేర్కొన్నారు. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైన మర్యాదగా ప్రవర్తించాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి