)
KTR Fires On CM Revanth: మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మితిమీరిన అహంభావం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రూ. 15 వేల కోట్ల భారం కూడా పడిందని ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి మితిమీరిన అహంభావం వల్ల ఇలా జరిగిందన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోందని ఎద్దేవా చేశారు. ఏకపక్ష నిర్ణయంతో మెట్రో ఎయిర్పోర్ట్ లైన్లు కూడా రద్దు చేశారు. ప్రధానంగా తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసమే ఉనికిలో లేని నాలుగోవ నగరం కూడా అభివృద్ధి చేస్తున్నారు. అటువైపుగా మళ్ళిస్తున్నారన్నారు.
ఇక తెలంగాణలో కూడా మూసీ నదికి వరదలు రావడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణమని కేటీఆర్ విమర్శించారు. మూసి సుందరీ కరణ పేరుతో రూ. 1.5 లక్షల కోట్లు దోచుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే సంక్షోభమని ఆయన అన్నారు. ఏళ్ల క్రితం మూసి వరదలు అరికట్టడానికి ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాలు నిర్మించింది నిజాం ప్రభుత్వం. ఇప్పుడు మూసి నియంత్రించటానికి జలాశయం నుంచి నీరు విడుదల చేయాలి సుందరినీ కరణ అంటూ ఆ నీళ్లు ఇప్పుడు బలవంతంగా ఆపారు అని ధ్వజమెత్తారు.
దీంతోపాటు మెడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్ అండీ టీ వంటి కార్పొరేట్ సంస్థను కూడా రేవంత్ సర్కార్ బెదిరించింది. ఇది కేవలం వారి భారీ ప్రయోజనాల కోసం మాత్రమే. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు రాజకీయ ప్రయోజనాలు లబ్ధి కోసం కమిషన్ల కోసమే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు.
మొత్తానికి ఎల్ అంటీ టీ ప్రతిష్టను దిగజార్చారు. వారికి తెలంగాణ ప్రజల మాదిరి రేవంత్‌ను భరించాల్సిన అవసరం లేదు. అందుకే రాష్ట్రం నుంచి అది వెనక్కి వెళ్ళిపోతుంది. సీఎం మితిమీరిన అహంభావం వల్ల చెల్లింపుదారులపై రూ.15000 కోట్లు అప్పుల భారం కూడా పడింది. ఇదంతా ప్రభుత్వం చేతకాని తనం వల్లే జరిగిందని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిలిచిపోయింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు? ఆరు గ్యారెంటీలు ప్రస్తుతానికి అటకేక్కాయి రుణాన్ని భరించలేక రేవంత్ రెడ్డి నిధులు లేవంటూ చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి నిధులు ఉన్నాయి ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి