Delimitation:దేశంలో పునర్విభజన పూర్తయితే ఉత్తరాది ఆధిపత్యం మరింత పెరగడం ఖాయం అనే భయం మన నాయకులు అనవసరంగా పుట్టిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో లేని సీట్లు.. అతి చిన్నదైన తమిళనాడులో ఉంది. మరోవైపు తెలంగాణ కంటే చిన్నదైన కేరళలో 20 లోక్ సభ సీట్లు.. ఉంటే.. తెలంగాణ లో 17 లోక్ సభ సీట్లు ఉన్నాయనే విషయాన్ని కొంత మంది ప్రస్తావిస్తున్నారు. ఇక దేశంలో విస్తీర్ణంలో పెద్దదైన రాజస్థాన్ 25 సీట్లు ఉంటే.., గుజరాత్ లో 26 సీట్లే ఉన్నాయి. అటు దక్షిణాదిలో కర్ణాటకలో చిన్నరాష్ట్రమైన 28 సీట్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో 4,6 లోక్ సభ సీట్లే ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. కేవలం నార్త్ లో ఉత్తర ప్రదేశ్ లో 22 కోట్లకు 80 సీట్లు ఉంటే.. దక్షిణాదిలో మొత్తం జనభా ప్రకారం చూసుకుంటే 20 కోట్ల వరకే ఉన్నా.. దాదాపు 145 కు పైగా లోక్ సభ సీట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు బిహార్ లో 40, పశ్చిమ బెంగాల్ లో 42 సీట్లున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని న్యాయ, రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన కాకరేపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేశ్ గౌడ్ హాజరవుతున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొంటుండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు. ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యాయి.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. మరోవైపు స్టాలిన్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే ఈ డీలిమిటేషన్ అస్త్రాన్ని అందుకున్నట్టు బీజేపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









