Jubilee Hills By Election Result: 'ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశాం. కానీ ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశాం. ఎన్నికల సంఘం, పోలీస్ పనితీరుపై చర్చ జరగాలి. ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపైన ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉంది' బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: KTR Resign: జూబ్లీహిల్స్‌లో ఘోర ఓటమి.. కేటీఆర్ పదవికి రాజీనామా?
'ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ ఎన్నిక ఫలితంపై కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సింది. మాకు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చింది. సింగిల్ డిజిట్‌లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించింది' అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్
'పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారు. ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందాం. మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటాం. ప్రజలతోనే ఉంటాం. ప్రజల కోసమే ఉంటాము. ప్రజల్లోనే ఉంటాం. తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన లగచర్ల నుంచి మొదలుకొని అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నాం' అని తెలిపారు. ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
Also Read: Schools Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
'సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండబెడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎన్నికతో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బిహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారు. ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదాం' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
'పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నాయకులను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయి అని ఆశిస్తున్నాం. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం' అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామని ప్రకటించారు. దీపావళి వంటి పండగను కూడా పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి, కార్యకర్తకు ధన్యవాదాలు అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









