KTR: మాకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ఇవ్వండి.. రేవంత్‌ రెడ్డిని గల్లా పట్టి నిలదీస్తాం

KTR Massive Road Show In Yusufguda: ఓటు వేసే ముందు పదేళ్ల కేసీఆర్‌ గొప్ప పాలన.. రెండేళ్ల విఫల కాంగ్రెస్‌ను చూడాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. జూబ్లీహిల్స్‌ ఇస్తే రేవంత్‌ రెడ్డిని గల్లా పట్టి నిలదీస్తామని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 9, 2025, 05:56 PM IST
KTR: మాకు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ఇవ్వండి.. రేవంత్‌ రెడ్డిని గల్లా పట్టి నిలదీస్తాం

Jubilee Hills By Election: 'ఓటు వేయ‌క‌పోతే ప‌థ‌కాలు ఆపుతామ‌ని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు.. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని ప‌థ‌కాలు ఆపుతాడు' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. బజార్ల‌కు గుంజి ప‌థ‌కాల గురించి గ‌ల్లా ప‌ట్టి నిల‌దీస్తామని హెచ్చరించారు. కొంద‌రు ఆకు రౌడీలు బెదిరిస్తున్నారు.. వాళ్ల సంగ‌తి తేలుస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. గెల‌వ‌క‌ముందే ఇన్ని బెదిరింపుల‌కు దిగుతున్నారు.. గెలిపిస్తే ఊరుకుంటారా? అని జూబ్లీహిల్స్‌ ప్రజలకు చెప్పారు. ఆడ‌బిడ్డ అని చూడ‌కుండా సునీత‌మ్మ‌పై కూడా కుట్ర‌లు చేస్తున్నారని తెలిపారు. 'ఓడిపోతామ‌ని తెలిసి ఓటు కోసం డ‌బ్బులు పంచుతున్నారు. రేవంత్ రెడ్డి పంచాలంటూ డ‌బ్బులు పంపిస్తే.. అందులో కూడా క‌మీష‌న్ల తీసుకుంటున్నారంటా కాంగ్రెస్ నాయ‌కులు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Udyogini Scheme: మహిళలకు ఈ పథకం ఓ వరం.. వడ్డీ లేకుండా రూ.3 లక్షలు ఇలా!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూస‌ఫ్‌గూడ‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మోసాలు, ఫెయిల్యూర్‌తోపాటు కేసీఆర్‌ చేసిన అభివృద్ధి వివరించి కేటీఆర్‌ ఓట్లు అడిగారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయండి. కేసీఆర్ అంద‌రినీ క‌డుపులో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకున్నాం. బ‌స్తీ ద‌వాఖానా, 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచిత నీళ్లు, క‌రెంటు క‌ష్టాలు లేకుండా చేసుకున్నాం. వెంగ‌ళ్‌రావు న‌గ‌ర్‌లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి, హైద‌రాబాద్‌లో 42 ఫ్లై ఓవ‌ర్లు, కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి స‌మ ప్రాధాన్య‌ం ఇచ్చాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ ఘనతలు మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Also Read: Harish Rao: జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ.. సునీత గెలిస్తే రేవంత్ రెడ్డికి చుక్కలే

'ల‌క్ష‌ల కొద్ది ఐటీ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. కొంచెం క‌ష్ట‌మైనా కుటుంబం బాగుండాల‌ని పేద‌లు ప్లాట్లు కొన్నారు. కానీ ఆ ప్లాట్ల ధ‌ర‌లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అంద‌రూ ఆలోచించాలి. మ‌నం పెట్టిన పెట్టుబ‌డులు హ‌ర‌తి క‌ర్పూరంలా క‌రిగిపోతున్నాయి. ఎన్ని అబ‌ద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందో గుర్తు తెచ్చుకోవాలి. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అంద‌రినీ మోసం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు.

Also Read: Jagadish Reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవదు

తులం బంగారం ఇస్తామ‌న్నారు.. ఎవ‌రికైనా ఇచ్చారా? అని జూబ్లీహిల్స్‌ ప్రజలను మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆడ‌బిడ్డ‌ల‌కు రూ.2,500, వృద్ధుల‌కు రూ.4 వేలు పెన్ష‌న్ ఇచ్చారా? అని నిలదీశారు. ఈ రెండేళ్ల‌లో ఒక్క మాట కూడా నిల‌బెట్టుకోని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తామంటే ఎవ‌రూ న‌మ్మ‌రు అని తెలిపారు. ఇందిర‌మ్మ ఇల్లు ఇస్తామ‌ని చెప్పి ఇళ్లు కూల‌గొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. శ‌నివారం, ఆదివారం వ‌చ్చిందంటే పేద‌ల ఇళ్ల‌పైకి బుల్డోజ‌ర్ వ‌స్తోందని.. రెండేళ్ల‌లో వేల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేశారని వివరించారు.

'ఇందిర‌మ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూల‌గొట్టే వాళ్ల‌కు ఎవ‌రైనా ఓటు వేస్తారా? క‌త్తి కాంగ్రెస్‌కు ఇచ్చి యుద్ధం మ‌మ్మ‌ల్ని చేయ‌మంటే ఎలా చేయాలి? క‌త్తి మాకు ఇవ్వండి బుల్డోజ‌ర్‌కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్య‌త మాది' అని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుల్డోజ‌ర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీత‌మ్మ‌ను గెలిపించుకుంటే.. మ‌ళ్లీ కేసీఆర్ వ‌స్తారని ప్రకటించారు. 500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందామని తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తే.. రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటడో.. మూడు నెల‌లు ఉంట‌డో తేలిపోతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఢిల్లీలో రేవంత్‌పై క‌త్తులు నూరుతున్నారంటా.. కొంద‌రు నేత‌లు సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారని చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి తీయ‌ని మాట‌లు చెప్తారు.. ఆ త‌ర్వాత పైస‌లు లేవ‌ని చేతులెత్తేస్తారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి తర‌హాలో చిల్ల‌ర‌గా మాట్లాడ‌లేదని పేర్కొన్నారు.

'పెన్ష‌న్ అడిగితే గుడ్లు పీకుతామంటారు.. తులం బంగారం అడిగితే పేగులు పీకి మెడ‌లో వేసుకుంటా అంటారు. గెలిచిన ఎమ్మెల్యేల‌కే రేవంత్ రెడ్డి ఏమీ ఇవ్వ‌ట్లేదు. మాకే దిక్కులేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పెళ్లిల్లు, పేరంటాల‌కు వెళ్ల‌డం త‌ప్ప ప‌నులు చేయ‌డానికి డ‌బ్బులు లేవ‌ని యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి చెప్పారు. మ‌రో ఎమ్మెల్యే డ‌బ్బులు కావాలంటూ వ‌ర‌ల్డ్ బ్యాంక్‌కు లెట‌ర్ రాశారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. అమ్మ‌కు అన్నం పెట్ట‌డు.. చిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తడా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన వ్య‌క్తి జూబ్లీహిల్స్‌కు న్యాయం చేస్త‌రా? అని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News