)
KTR vs Three Ministers: 'గ్యారెంటీ కార్డు భధ్రంగా పెట్టమన్నారు భట్టి విక్రమార్క మరి రెండేళ్లలో మీ హామీలు ఎక్కడ పోయాయి? ఇప్పుడు గ్యారెంటీ కార్డు ఎక్కడ పెట్టాలి?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 'ఏం పని అయినా 30 శాతం కమీషన్ భట్టి విక్రమార్క అడుగు తున్నారు. ఏ భూమి సమస్యల వచ్చాన 30 శాతం భూమి బాంబులేటి అడుగుతున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కమీషన్లు మరిగాడు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఖమ్మం జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను మాజీ మంత్రి కేటీఆర్ సన్మానించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధం అయింది. ముగ్గురు మంత్రులు ఉన్నా, యురయా బస్తాలు దొరకడం లేదు. రైతుల అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఖమ్మం ప్రజల్లో ఆగ్రహం, వ్యతిరేకత కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ నామమాత్రంగా సర్పంచ్ లు గెలిచింది.. కానీ బీఆర్ఎస్ 40 శాతం సర్పంచ్‌లు గెలిచాం' అని వెల్లడించారు.
'షాపుల్లో యూరియా లేదు. యాప్‌లో యాడ వస్తుంది. యూరియా కార్డుతో కొత్త నాటకం ఆడుతున్నారు. ఈ దౌర్భాగ్యులు వచ్చాక రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలీదు. నదీ జలాల మీద అవగాహన లేదు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందట. బేసిన్లు కూడా తెలీదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణ మీద పెట్టుబడి. రైతుల కోసం, భావితరాల మీద పెట్టిన పెట్టుబడి. భవిష్యత్ కోసం, అభివృద్ధి మీద కేసీఆర్ ఖర్చు చేశారు. కేసీఆర్ మీలాగా దోచుకోలేదు' అని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణను దోచుకొని ఢిల్లీ కప్పం కడుతున్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టకలేదు పోస్ట్ ఊస్టే! పదవి పోతుందని, నెల నెలా ఢిల్లీకి కప్పం కడుతున్నారు' అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రెండు దీపావళులు పోయాయి కానీ బాంబులు పేలలేదు. సిగ్గు లేకుండా అదానీ, అంబానీ, మోడీ కాళ్ల మీద పడి ఈడీ కేసు మాఫీ చేయించుకుంటున్నాడు. బీజేపీలో చేరతానని మోడీ ఎదుట మోకరిల్లి, బీజేపీ మోకరిల్లి ఈడీ కేసు మాఫీ చేయాలని తిరుగుతుండు' అని పొంగులేటిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
'ఇంకో మంత్రి కార్పొరేటర్ల ఇళ్లు తిరుగుతున్నాడు. మా ముగ్గురు కార్పొరేటర్లను చేర్చుకుంటుండు. ప్రజలు అనుకుంటే తుమ్మల ఏం చేయలేరు . మా కార్పొరేటర్ పోతే ఏం కాదు. జనం అనుకోవాలి అంతే. జనం అనుకుంటే ఏది ఆగదు' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 2014లో ఓడిపోయి ఇంట్లో ఉంటే మిత్రుడని భావించి తుమ్మలను కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కేసీఆర్ హయాంలో జరిగిందని ప్రకటించారు.
కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్ ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి