)
KTR Speech: తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన కొత్త కెమిస్ట్రీ ల్యాబ్‌ను శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, హ్యూవెల్ కంపెనీ ఎండీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్యుడికి లాభం చేకూర్చని పరిశోధన నిష్ఫలం అని ప్రకటించారు. సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. 'దేశంలో 80 శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు?' అనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేశారు. దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
'పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్పూర్ ప్రాంతంలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పని చేస్తుండడం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ జరిగిన పరిశోధనలు, ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే తనకు విశ్వాసం కలిగింది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు, కోవిడ్ కిట్స్‌కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు.
కరోనా సమయంలో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 'సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దాని వల్ల వ్యర్థం' అని కేసీఆర్ తమకు ఎప్పుడూ చెబుతుంటారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంకేతికత (టెక్నాలజీ) ఉన్నా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని కేసీఆర్ సందేశాన్ని పునరుద్ఘాటించారు. 'మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను, దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నా' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం' అని కేటీఆర్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook