)
Maganti Sunitha: 'బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రూ.2,500 ఆడబిడ్డలకు ఇస్తారు. రూ.4 వేలు పెన్షన్ ఇస్తారు. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే నేనేం చేయకపోయినా.. నాకే ఓటేశారంటే.. పథకాలు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదని అంటారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్క సీటు కోసం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారంటే వాళ్లు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుందని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగిన కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మందికి న్యాయం చేసే అవకాశం దక్కింది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ తెలియగానే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు.
'ముందు సినిమా వాళ్లను జైల్లో పెడతారు.. ఎన్నికలు వస్తే బలవంతంగా సినిమా వాళ్లతో సన్మానం చేయించుకున్నారు. యూసఫ్‌గూడలో సినీ కార్మికులను కాపాడుకునే బాధ్యత మాది' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'ఎన్నికల తర్వాత పోలీసులను కూడా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు. పోలీస్ కుటుంబాలనే కొట్టించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలాంటి మనిషిని ఎవరైనా నమ్ముతారా?' అని ప్రశ్నించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీసులకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు.
'ఈ నెల 14న జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బకు రేవంత్ కుర్చీ ఉంటదో.. ఊడుతుందో చూసుకోవాలి. రెండేళ్ల క్రితం మోసం పోయాం.. ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం.. మళ్లీ మోసపోవద్దు' అని జూబ్లీహిల్స్ ఓటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు కుక్కర్లు, చీరలు పంచుతున్నారంటా.. నిజంగానే మంచి చేస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా? అని ప్రశ్నించారు.
'నియోజకవర్గానికి వచ్చి ముస్లింలను కూడా రేవంత్ రెడ్డి బెదిరించారు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అంటున్నారు.. ఇది పద్ధతేనా? అని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం సోదరులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 'అసదుద్దీన్.. రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి.. గాంధీభవన్ మోహన్ భగవత్ నడిపిస్తున్నారని చెప్పిన అసదుద్దీన్.. ఇప్పుడు ఎందుకు ఆయనకు మద్ధతు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి కోసం ఎందుకు అసదుద్దీన్ మారిపోయారు?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
'మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ ఏమిచ్చిందని అసదుద్దీన్ ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. పదేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉండెనో.. రెండేళ్ల రేవంత్ పాలన ఎలా ఉందో ఆలోచించి ఓటేయాలి' అని జూబ్లీహిల్స్ ఓటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మాగంటి గోపినాథ్ భార్య సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఓట్లేయకపోతే.. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగ దారిలో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని.. కారు గుర్తుకు ఓటేసి.. కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి