)
BRS Party: 'ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. వారు కూడా మా అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా.. చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మాగంటి సునీతకు కూడా అభినందనలు చెబుతున్నట్లు చెప్పారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ కీలక మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు ప్రకటించారు. 'ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదు అయింది. ప్రతి ఎన్నికల్లో గెలవాలని పోటీ చేస్తాం. రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో.. ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడింది' అని వివరించారు. ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారని గుర్తుచేశారు.
'ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయి. ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు తీర్పునిచ్చారు. ఈ అంశాన్ని సానుకూల అంశంగా పార్టీ పరిగణిస్తున్నది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. '2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
'గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయాం. కులం, మతం పేరుతో రాజకీయం చేయలేదు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బూతులు మాట్లాడినా, ప్రచారం సందర్భంగా తాము హుందాగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా తాము చేసిన అభివృద్ధిని చూపించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని 'బాకీ కార్డు' రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయామని వివరించారు. హైడ్రా నుంచి మొదలుకొని, ఆటో అన్నల సమస్యల వరకు అనేక అంశాలను ప్రచారం సందర్భంగా ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేశామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కారణంగానే గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాం. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చింది. గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి