)
BRS Party MLAs: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సిగ్గుపడాలని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీని నిలదీశారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరమని ప్రకటించారు. ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?" అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు చోరీపై నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడాన్ని తీవ్ర తప్పు అని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
"ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయిన రాహుల్ గాంధీకి సిగ్గుందా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్లపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బహిరంగంగా, సిగ్గు లేకుండా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యాన్ని చూసి రాహుల్ గాంధీ సిగ్గుపడాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రతి ఎమ్మెల్యే రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిసి, వారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈరోజు వీరిని గుర్తుపట్టగలరా? అని ఫొటోలను చూపిస్తూ రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్‌లో చేరలేదని చెప్పడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
'అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు. మీరు దీన్ని ఒప్పుకుంటారా?' అని రాహుల్ గాంధీని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. "ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?" అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల కంటే ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని స్పష్టం చేశారు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై రాహుల్ గాంధీకి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.