KTR Vs Kavitha: కవితకు ఇచ్చి పడేసిన కేటీఆర్.. చెల్లైన ఎవరైనా డోంట్ కేర్..

KTR Vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. అన్నా చెల్లెల్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అంతేకాదు బీఆర్ఎస్ ఛీఫ్ తండ్రి కేసీఆర్ తో పాటు పార్టీ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కవిత లేఖ పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ స్పందించాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2025, 02:03 PM IST
KTR Vs Kavitha: కవితకు ఇచ్చి పడేసిన కేటీఆర్.. చెల్లైన ఎవరైనా డోంట్ కేర్..

KTR Vs Kavitha: బీఆర్ఎస్ ఇంటిగుట్టు రచ్చ కెక్కింది. ఇన్నాళ్లు లోలోన ఉన్న అసంతృప్తి కవిత లేఖతో ఒక్కసారిగా బయటపడింది. ఇక కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రాసిన లేఖపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించాడు. పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. అది తమ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందన్నారు. ఎవరైనా పార్టీ బాగు కోసం అధ్యక్షుడికి లేఖ రాయోచ్చు అంటూ చెప్పుకొచ్చారు. పార్టీలోని ఇంటర్నల్ విషయాలను అంతర్గతంగా కూర్చొని మాట్లాడితే బాగుటుందన్నారు. ఇలా ఎవరో చెబితే రచ్చ కెక్కడం బాగా లేదంటూ కవితకు ఇచ్చిపడేసాడు. అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు. టైమ్ వచ్చినపుడు వారే బయటపడతారన్నారు.

 
ఈ సందర్భంగా కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం మాత్రమే కాదని.. మూటల సీఎం అని అభివర్ణించారు. ఆయనకు ఢిల్లీలో ఇద్దరు బాసులున్నారు. అందులో ఒకరు ఆ పార్టీ మాజీ ప్రెసిడెంట్ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే... రెండోది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో రేవంత్ పేరు ఉంది.

 గతంలో ఈడీ ఛార్జ్ షీట్ లో పేరున్న సీఎంలు, కేంద్ర మంత్రులు, మంత్రులు రాజీనామా చేశారు. రేవంత్ కూడా దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అప్పట్లో ఎన్నికల సమయంలో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టాక్స్ నడుస్తోందని నరేంద్ర మోడీ న్నారు. మరి దానిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఆయనను వెనకాల ఉండి కాపాడుతున్నది ప్రధాని మోడీనే అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా.. వాటి కోసం చేసిన అప్పుల్లో చాలా భాగం కాంగ్రెస్ పార్టీకి కప్పంగా వెళుతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:   కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News