)
KTR Letter To Rahul Gandhi: హిల్ట్ పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన లేఖ రాశారు. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం అని ప్రకటించారు. రాహుల్ గాంధీ స్పందించకుంటే రూ.5 లక్షల కోట్ల అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లే అని లేఖలో పేర్కొన్నారు. ఐదు లక్షల కోట్ల భూమి తెలంగాణ ప్రజల ఆస్తి అని ప్రకటించారు. లక్షల కోట్ల భూములను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారుస్తామంటే అంగీకరించమని హెచ్చరించారు.
రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను ఈ సందర్భంగా లేఖలో రాహుల్ గాంధీకి కేటీఆర్ వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) 'స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి'గా లేఖలో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా? లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని లేఖలో రాహుల్ గాంధీకి కేటీఆర్ చెప్పారు.
ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడాని వీలు కల్పిస్తుంది. దీంతో తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది' అని రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్లలో గత ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కేటీఆర్ తన లేఖలో గుర్తుచేశారు.
ఆ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. కొత్త హిల్ట్ కింద పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకోవడానికి ఎస్ఆర్ఓ (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు అని పేర్కొనడంపై మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజాలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని లేఖలో రాహుల్ గాంధీకి కేటీఆర్ లెక్కలు వివరించారు.
పారదర్శకత లేని విధానంతో కేవలం డబ్బులు దండుకోవాలని హిల్ట్ విధానం తీసుకువచ్చారని రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తొందరపాటుతనంతో ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని లేఖలో రాహుల్ గాంధీకి కేటీఆర్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook