Minor Kills Elderly woman in kushaiguda: కుషాయిగూడలో దారుణ ఘటన నేడు వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ వృద్ధులరాలిని ఘోరంగా ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. అంతటితో వాడి కసి తీరకుండా ఫ్యాన్‌కు తల కట్టేసి శవంపై డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో కూడా తీసి తన స్నేహితులకు సైతం షేర్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ 17 ఏళ్లు కుర్రాడు కమలాదేవి (70) ఓనర్‌ను చంపి ఆ దారుణ ఘటనను వీడియో తీశాడు. కుషాయిగూడ పరిధిలో ఈ ఘటన ఏప్రిల్ 11వ తేదీన జరిగింది. అయితే, ఈ మర్డర్‌కు సంబంధించిన వీడియో సదరు నిందితుడు స్నేహితులు, మృతురాలి బంధువులకు కూడా పంపించడంతో పోలీసులకు విషయం తెలిసింది. పోలీసుల దర్యాప్తులో 30 ఏళ్ల క్రితం ఓ రాజస్థానీ కుటుంబం హైదరాబాద్‌లో వచ్చి స్థిరపడ్డారు. అయితే, బాధితురాలి భర్త 15 ఏళ్ల కిందట మరణించాడు. అప్పటి నుంచి కమలా దేవి మాత్రమే కృష్ణ నగర్‌లో దుకాణం నిర్వహిస్తూ బతుకుతోంది. అయితే, తనతోపాటు మరికొందరిని పనిలో పెట్టుకుంది.
ఆమెకు కొన్ని దుకాణాలు ఉన్నాయి తద్వారా ఆమెకు నెలకు రూ.50 వేల వరకు అద్దె వస్తుంది. అయితే, నిందితుడు తన దుకాణంలోనే పనిచేసేవాడు. అంతేకాదు ఇంట్లో కొన్ని పనుల్లో కూడా సహాయం చేసేవాడు. అయితే, ఇటీవల ఈ మైనర్ నిందితుడితో కమలకు గొడవ జరిగింది. అప్పటి నుంచి ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీన రాత్రి కమల ఇంట్లోకి చొరబడి ఆమెపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత ఆమె చీరతోనే బెడ్‌పై ఉండే ఫ్యాన్‌కు తలను కట్టేశాడు. ఆపై తన మొబైల్ ఫోన్ వీడియో ఆన్ చేసి డెడ్ బాడీ పై డ్యాన్స్ చేస్తూ వీడియో రికార్డు చేశాడు.
ఇదీ చదవండి: ఆల్కహాల్ తీసుకోనివారిలో కూడా కాలేయం ఎందుకు పాడవుతుంది తెలుసా? ఇదొక్కటే కారణం..
ఆ తర్వాత ఇంటికి బయట వైపు నుంచి తాళం వేశాడు. అక్కడే పక్కనే తాళం కీ కూడా పడేసి వెళ్లిపోయాడు. ఆతర్వాత మృతురాలి బంధువు బెంగళూరులో ఉండే ఓ వ్యక్తికి ఆ వీడియో పంపాడు. దీంతో ఖంగుతిన్న సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసి, వీడియో పంపాడు. వెంటనే పోలీసులు మృతురాలి ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. అయితే, అప్పటికే మూడు రోజులు కావడంతో డెడ్ బాడీ సగం కుళ్లిపోయింది. వెంటనే బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై మాసం ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









