Lady Aghori: లేడీ అఘోరీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. అరెస్ట్ చేసిన మోకీలా పోలీసులు..

Lady AGhori controversy:  లేడీ అఘోరీ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పూజల పేరుతో చీటింగ్ చేశారని అఘోరీపై మోకీలా పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో మోకీలా పోలీసులు యూపీకి వెళ్లి అఘోరీని అరెస్ట్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2025, 06:13 PM IST
  • లేడీ అఘోరీ అరెస్ట్..
  • హైదరబాద్ తరలిస్తున్న పోలీసులు..
Lady Aghori: లేడీ అఘోరీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. అరెస్ట్ చేసిన మోకీలా పోలీసులు..

Lady aghori arrested in uttar Pradesh: నగ్నపూజల పేరుతో తమను మోసం చేసిందని ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇటీవల లేడీ అఘోరీపై మోకీలా పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టారు.  ఉత్తర ప్రదేశ్ లో ఉన్న లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Add Zee News as a Preferred Source

అఘోరీతో పాటు ఆయన భార్య...  వర్షిణీని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజలు పేరుతో  ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. అఘోరీ తమను ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి.. అక్కడ రూ. 5 లక్షలు తీసుకుని నగ్నపూజలు చేసి... మరో 5 లక్షలు ఇవ్వకుంటే.. పూజలు రివర్స్ అయ్యేలా చేస్తానని.. మీరంతా చచ్చిపోయేలా చేస్తానని అఘోరీ  భయ భ్రాంతులకు గురిచేసిందని ప్రొడ్యూసర్ పొలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతే కాకుండా.. తల్వార్ లు, గన్ లు పెట్టుకుని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని మోకీలా పోలీసులు నగరానికి తీసుకుని వస్తున్నారు.

లేడీ ప్రొడ్యూసర్ ముఖ్యంగా తనకు అఘోరీ..6 నెలల క్రితం పరిచయం అయ్యాడని చెప్పింది.  కొన్ని నెలల తర్వాత ప్రొద్దుటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని, అప్పుడు తరచుగా తన ఇంట్లోని సమస్యల్ని గురించి ఆరా తీసిందని చెప్పింది.  అదే విధంగా నగ్నపూజలు చేస్తే కుటుంబంలోని దోషాలన్ని పోతాయని చెప్పి.. యూపీలొని ఉజ్జయినీలో ఫామ్ హౌస్ లో పూజలు చేసిందని సదరు మహిళ తెలిపింది.

Read more: Tirumala Video: మరోసారి వివాదంలో తిరుమల.. కళ్యాణ కట్ట దగ్గర మహిళా ఉద్యోగి ఏంచేస్తుందో తెలుసా..? .. వీడియో వైరల్..  

 పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం రూ. 5 లక్షలు, ఆ తర్వాత పూజల తర్వాత మరో   5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. దీంతో అఘోరీ చేతిలో మోసపోయినట్లు గ్రహించి.. మహిళ మోకిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు.. లేడీ అఘోరీని అరెస్ట్ చేసి.. హైదరబాద్ కు తరలిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News