Lady Aghori Video: తగ్గెదేలా.. జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..?.. అఘోరీ మరో సంచలనం..

Lady Aghori controversy: లేడీ అఘోరీని మోకీలా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరుపరిచారు.ఈ క్రమంలో అఘోరీ మాట్లాడుతూ.. తన భార్యతో జైల్లో కలిసే ఉంటానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : May 9, 2025, 11:53 AM IST
  • మళ్లీ రచ్చగా మారిన అఘోరీ ఘటన..
  • రిమాండ్ కు తరలించిన కోర్టు..
Lady Aghori Video: తగ్గెదేలా.. జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..?.. అఘోరీ మరో సంచలనం..

Lady Aghori naga sadhu Comments on Varshini: లేడీ అఘోరీ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో యూపీలో ఇటీవల మోకీలా పోలీసులు లేడీ అఘోరీని అరెస్టు చేసి హైదరబాద్ కు తరలించారు. అంతే కాకుండా.. నగ్నపూజల పేరిట లేడీ ప్రొడ్యూసర్ నుంచి  రూ.10 లక్షలు తీసుకుని అఘోరీ మోసానికి పాల్పడిందని ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ మోకీలా పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

అయితే.. దీనిపై ప్రస్తుతం.. మోకీలా పోలీసులు యూపీకి వెళ్లి మరీ లేడీ అఘోరీని అరెస్ట్ చేసి హైదరబాద్ కు తరలించారు. అంతేకాకుండా.. అఘోరీని చెవేళ్ల కోర్టులో హజరుపరిచారు. కోర్టు అఘోరీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లేడీ అఘోరీకి కోర్టు వారు రిమాండ్ విధించిన తర్వాత కోర్టు బైట చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారంగా మారాయి.

 ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని.. పోలీసులకు అన్ని విధాలుగా సహాకరిస్తానని లేడీ అఘోరీ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా.. తన భార్య శ్రీవర్షిని తనతో పాటే జైలులో ఉంటుందని కూడా అఘోరీ మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉండగా..  నగ్న పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని లేడీ అఘోరీ మోసం చేసిందని, అడిగితే బెదిరిస్తున్నదని ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Read more: Pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి బైటపడ్డ సెలబ్రిటీ జంట.. ఆ పోస్ట్‌పై రగిలిపోతున్న నెటిజన్లు..  

ఈ మేరకు మోకిలా పోలీసులు చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యూపీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించి.. చెవేళ్ల కోర్టులో హజరుపర్చారు. కోర్టు లేడీ అఘోరీకి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే.. జైలులో అఘోరీకి.. మహిళల బ్యారక్ కేటాయిస్తారా..?.. లేదా పురుషుల బ్యారక్ కేటాయిస్తారా..?.. ప్రత్యేకంగా వేరే బ్యారక్ కేటాయిస్తారా..?.. అనే దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లను వైరల్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News