Teachers Posts: కేసీఆర్‌ హయాంలో 26 వేల టీచర్ల భర్తీ జరిగింది: కుండబద్దలు కొట్టి చెప్పిన హరీశ్‌ రావు

KCR Govt Jobs Recruitment Says Harish Rao In Assembly: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు కానీ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2025, 05:13 PM IST
Teachers Posts: కేసీఆర్‌ హయాంలో 26 వేల టీచర్ల భర్తీ జరిగింది: కుండబద్దలు కొట్టి చెప్పిన హరీశ్‌ రావు

KCR Govt Jobs: అడ్డగోలు మాటలు.. అబద్ధపు ప్రచారం చేసి యువతను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిండు అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు కడిగిపారేశారు. అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కృషిని తప్పుగా చెప్పడంతో అసెంబ్లీలో హరీశ్ రావు తప్పుబట్టారు. ఈ సందర్భంగా తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్కలు చెప్పారు. ప్రభుత్వ టీచర ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రకటన చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Telangana Assembly: వేముల వర్సెస్‌ కోమటిరెడ్డి.. త్రిబుల్‌ ఆర్‌పై అసెంబ్లీలో రచ్చరచ్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం విద్యాశాఖ పద్దుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన అరకొర కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖను నిర్వహిస్తున్న రేవంత్‌ రెడ్డి ఆ శాఖకు కేటాయింపులు భారీగా లేవని తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన దానికి విరుద్ధంగా చెబుతున్నారని హరీశ్ రావు తప్పుబట్టారు.

Also Read: Drunk And Drive: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ రికార్డులు బద్దలు.. 'గిన్నీస్‌ బుక్‌లో' నీ పేరు పక్కా బ్రో!

'శ్రీధర్ బాబు నా పేరు తీసుకొని మాట్లాడారు. కాబట్టి సభ రికార్డులు సవరించడానికి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష' అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రసంగం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు కొట్టిపారేశారు. 'మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి' అని ప్రకటించారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్న కాలంలో 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశాం. గురుకులాల్లో 18,000 నియమకాలు చేశాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు లెక్కల చిట్టా విప్పారు. గణాంకాలతో సహా సభలో కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీని వివరించారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగితే 79 మూతపడ్డ బడులను తెరిపించామని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూతపడిన 1,913 పాఠశాలలు ఎందుకు మాట్లాడటం లేదు' అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News