LB Nagar Car Terror:హైదరాబాద్ (Hyderabad) , ఎల్బీనగర్ లో (LB Nagar)ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ బైక్‌ను ఢీకొట్టాడు. కారు ఆపకుండా బైక్‌ను అలాగే ఈడ్చుకెళ్తు ముందున్న మరో కారును ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ప్రభాకర్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ (Closed Circuit Television Camera) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









