Seetharamula Kalyanam in Bhadrachalam Live Updates: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదపండితులు శాస్త్రోక్తంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. శనివారం రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నేడు (ఆదివారం) ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భద్రాద్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం వీక్షించేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.









