సభ ఏర్పాట్లు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వచ్చే అవకాశం ఉంది. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్‌ను ఉంచారు.
బహిరంగ సభ వివరాలు
మొత్తం విస్తీర్ణం: 1,213 ఎకరాలు
సభా ప్రాంగణం: 154 ఎకరాలు. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ఏర్పాటు
పార్కింగ్: 1,059 ఎకరాలు. పార్కింగ్ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్ల నియామకం
10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
వేసవి నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో అత్యవసర వైద్య బృందాలు ఉండనున్నాయి. ఆయా రూట్లలో 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు.
1,200 తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు