)
కోటి ఉమెన్స్ కాలేజ్ లో విషాద ఛాయలు..
కాలేజ్ కి సంబంధించి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం బాధాకరం..
షాక్ తో ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు అని తెలిపిన విద్యార్థులు..
తాజా సమాచారం..
టిప్పర్ డ్రైవర్ ఆకాష్‌గా పోలీసుల గుర్తింపు..
మహారాష్ట్ర వాసి..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆకాష్..
కాంబ్లే పటాన్‌చెరు క్రషర్ మిల్లు నుంచి
వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తున్న డ్రైవర్ ఆకాష్..
లోకపావని , ప్రిన్సిపాల్ , కోటి మహిళా కళాశాల
చేవెళ్ల బస్ యాక్సిడెంట్ లో మా విశ్వవిద్యాలయంకి చెందిన ముగ్గురు మృతి చెందారు
సాయి ప్రియ, నందిని, ముస్కాన్ ముగ్గురు మా విద్యార్థినులు
ముగ్గురు తాండూరు వాసులు
సాయి ప్రియా,ముస్కాన్ ఇద్దరు కూడా హాస్టల్ లో వుండేవారు
సెలవులు ఉండటం తో ఇద్దరు ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రమాదం
ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని వారు వస్తున్నారు
ఈ రోజు నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ లో
ఈ వార్త తెలియడంతో విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ సరిగ్గా రాసారో లేదో
చేవెళ్ల బస్ యాక్సిడెంట్ మృతుల్లో కోటి మహిళా యూనివర్సిటీ లో చదువుతున్న ముగ్గురు
1. ముస్కాన్ - 3వ సంవత్సరం చదువుతుంది. ఎంపీ సి ఐ ఎస్ , బీఎస్సీ
2 సాయి ప్రియ - డిగ్రీ 3వ సంవత్సరం, ఎం ఎస్ డి ఎస్ .
3. నందిని- మొదటి సంవత్సరం డిగ్రీ, బికామ్
పీఎంఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
పేషెంట్ల కండీషన్‌ను మంత్రికి వివరించిన డాక్టర్లు.. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన డాక్టర్లు..
ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజూరి అయిందని, మిగిలిన పేషెంట్లందరి కండీషన్ స్టేబుల్‌గా ఉందని వివరించిన డాక్టర్లు..
అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి
వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపిన మంత్రి
క్షతగాత్రులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించిన మంత్రి
బస్సు కండక్టర్‌తో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన తీరును తెలుసుకున్న మంత్రి
చేవెళ్ల మండలం, మీర్జగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందన.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి- ప్రజల ప్రాణాలు కాపాడాలి
- వెస్ట్ హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది.
- చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరం. అందరినీ కలచివేసే ఘటన.
- ఈ రోడ్డు 2015-16 లోనే నేషనల్ హైవే గా అభివృద్ధి చెందాల్సి ఉండే.
- కేసులు వేయడం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదు.
- దీనివల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారు.
- ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే పనులు పూర్తి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా.
- ప్రజల దగ్గర టాక్స్ వసూలు చేయడమే కాదు.. పదే పదే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- ఈ మధ్య రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొన్న రాజస్థాన్, నిన్న కర్నూల్, ఇవ్వాళ చేవెళ్ళ. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇలా చనిపోవడం సభ్య సమాజం తల దించుకునే పరిస్థితి.
- నిర్లక్ష్యం వహించకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారులపై సమీక్ష నిర్వహించి తక్షణమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాను.
బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్
మొదట పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి అనంతరం చేవెళ్ల ఏరియా ఆసుపత్రికి వెళ్తారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
* రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు.
* తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుతున్నారు.
* ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు.
* ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.
రంగారెడ్డి : చేవెళ్ల బస్సు ప్రమాదానికి ప్రధాన కారణాలు.
( Mahanaadu Media )
1. ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్.
2. రోడ్డుపై గుంతలు, అక్కడే మలుపు.
3. బస్సును బలంగా కొట్టిన టిప్పర్.
4. ఢీకొట్టాక బస్సుపై పడిన టిప్పర్.
5. కంకరపై టార్పలిన్ కప్పకపోవడం.
6. ప్రయాణికులపై కంకర పడటంతో పెరిగిన మృతులు.
7. డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లను చీల్చేసిన టిప్పర్.
8. బస్సులో ప్రయాణించాల్సిన సంఖ్యకు మించి ప్రయాణికులు.
9. 54 మందికి గానూ 70 మంది ఎక్కడంతో పెరిగిన మృతులు
మీనాక్షి నటరాజన్.. తెలంగాణ, ఇన్‌చార్జ్
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
నా ఆలోచనలు మరియు ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.
ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.
ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను మరియు వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
చేవెళ్ల లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన లో గాయపడి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించటానికి హుటాహుటిన బయలుదేరిన రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహా .
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ గెట్ దగ్గర బస్సు ప్రమాదానికి గురైన బస్సులోని పదిమందినీ వికారాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు అందులో సోమయ్య అనే వృధుడు వయస్సు 63 గ్రీన్ సిటీ తాండూర్ కు చెందిన వారు ఉన్నారు మరో నలుగురు తాండూర్ వారిగా గుర్తించారు మరో ఐదు మంది హైదరాబాద్ చెందినవారుగా తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. ప్రమాదానికి ముఖ్య కారణం అని బస్సులోని ప్రయాణికుడు తెలిపారు. మరో ఇద్దరు వికారాబాద్ ఈషా హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సులో గాయాలై నవారి వివరాలు
లక్ష్మణ్ S/o రాములు age (30) మహబూబ్ నగర్
సోమయ్య తాండూర్ age (63) గ్రీన్ సిటీ తాండూర్
తొబిజ్ d/o షఫీ age 6
కృష్ణ బాగ్ హైదరాబాద్
అస్మా సయ్యద్ d/o షఫీ 31
కృష్ణ బాగ్ హైదరాబాద్
సబీ D/o సయ్యద్ అహ్మద్ (33) బహదూర్పుర హైద్రాబాద్.
సౌమ్య అబ్దుల్లా age 26 , కృష్ణ బాగ్, హైదరాబాద్
సయ్యద్ అహ్మద్ age 33 , కృష్ణ స్నాబాగ్ హైదరాబాద్
ఆస్మా 30 , కృష్ణ బాగ్,
ప్రవీణ 26 తాండూర్
స్వప్న 21 ఖానాపూర్ పెదేమూల్
తాండూర్ బృందావని కాలనీ నివాసులు
అబ్దుల్ మజీద్ భార్య పిల్లలతో తాండూర్ నుండి హైదరాబాద్ ఆసుపత్రికి వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదం.
ప్రమాదంలో తల్లిని మరణించింది... తండ్రి చికిత్స పొందుతున్నాడు.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ముగ్గురు పిల్లలు.. ఏమి అర్థం కాని పరిస్థితిలో వచ్చిపోయే వారిని చూస్తూ ఉన్నారు... ఇది చాలా బాధాకరం
చేవెళ్లలో బస్సు రోడ్డు ప్రమాదంతో తాండూరు పట్టణంలో విషాదఛాయలు..
గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు దుర్మరణం..
ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లూ మృతి..
మృతులు తనూష, సాయి ప్రియ, నందిని
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో తాండూర్ పట్టణం వడ్డెర గల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందారు... తండ్రి ఎల్లయ్య గౌడ్ తల్లి అంబిక.. తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అక్టోబర్ 17వ తేదీన పెద్ద కుమార్తె అనూష పెళ్లి జరిగింది ... వీరిలో రెండవ కూతురు తనూష ఎంబీఏ చేస్తున్నది ... హైదరాబాదులోని కోటి ఉమెన్స్ కళాశాలలో మూడవ కుమార్తె సాయిప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగవ కుమార్తె నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాదులోని హాస్టల్ కి వెళ్లేందుకు ట్రైన్లో వెళ్లేందుకు ఎత్నించగా ట్రైన్ మిస్ అయింది దీంతో తండ్రి ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను తాండూరు ఆర్టీసీ బస్టాండ్ లో దింపేశాడు హైదరాబాద్ బస్సు ఎక్కించాడు... ఇటీవలే అక్క పెళ్లి లో ఆనందంగా గడిపిన క్షణాలు ఆవిరి కావడంతో కుటుంబమంతా విషాదఛాయలోమ్ని తేలింది
రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా గారు చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ను అందించాలని రాష్ట్ర వైద్య శాఖ అధికారులను ఆదేశించారు .
బాధితులకు మెరుగైన చికిత్స ను అందించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత , రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ , రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా . అజయ్ కుమార్ లను ఆదేశించారు .
మంత్రి అధికారులతో ఎప్పటికప్పుడు టెలిఫోన్ లో మాట్లాడి పరిస్థితి ని సమీక్షిస్తున్నారు .
ఘటన లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స ను అందించేలా వైద్యుల కమిటీ ని నియమించాలని అధికారులతో టెలిఫోన్ లో ఆదేశించారు .
ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు
మంత్రి పొన్నం ప్రభాకర్...
బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు..మంత్రి పొన్నం ప్రభాకర్..
మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది..
మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి
19 మందిలో 13 మంది మృతులను గుర్తించిన పోలీసులు
వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు
మృతల కుటుంబాలకు 5లక్షలు ఎక్స్గ్రేషియా
క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం
పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తాం
చేవెళ్ల మండలం లో జరిగిన బస్సు ప్రమాదం తనను కలిచి వేసిందని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన చోట దృశ్యాలు బాధ కలిగించాయని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరుపున తగిన పరిహారం తో పాటు.. సాయం అందించే అన్ని చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.
ప్రమాదాలు జరిగినపుడు ఆర్టీసీ తరపున అందించే ఇన్సురెన్సు తో పాటు బాధిత కుటుంబాలకు భరోసా నిచ్చే చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేశాయి.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. క్షతగాత్రులకు…
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2025
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు మరికాసేపట్లో చేరుకోనున్న హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డాక్టర్ అజయ్ కుమార్
ఉస్మానియాలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సీనియర్ ప్రొఫెసర్లతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
మంత్రి సూచనలతో ఉస్మానియా చేరుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్.
Control room on Bus Accident at Secretariat
9912919545
9440854433
మృతుల పోస్ట్‌మార్టమ్ కోసం గాంధీ, ఉస్మానియా నుంచి ఫోరెన్సిక్ నిపుణులతో బృందాల ఏర్పాటు
మృతుల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా మృతదేహాలను అందించేందుకు చర్యలు
బస్సు ప్రమాదం ఘటనలో 25కు చేరిన మృతుల సంఖ్య..ఘటన స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి...
కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నం..తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ కు తరలిస్తున్న అధికారులు..
కొనసాగుతున్న సహాయక చర్యలు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ ఘటనపై పలువురు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రుల సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2…
— PMO India (@PMOIndia) November 3, 2025
The loss of lives due to a mishap in the Rangareddy district of Telangana is deeply saddening. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…
— PMO India (@PMOIndia) November 3, 2025
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.
మృతుల వివరాలు..
* దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
* తారిబాయ్ (45), దన్నారమ్ తండా
* కల్పన (45), బోరబండ
* బచ్చన్ నాగమణి (55), భానూరు
* ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
* మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
* గుర్రాల అభిత (21), యాలాల్
* గోగుల గుణమ్మ, బోరబండ
* షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
* తబస్సుమ్ జహాన్, తాండూరు
క్షతగాత్రులు..👇
* వెంకటయ్య
* బుచ్చిబాబు-దన్నారమ్ తండా
* అబ్దుల్ రజాక్-హైదరాబాద్
* వెన్నెల
* సుజాత
* అశోక్
* రవి
* శ్రీను- తాండూరు
* నందిని- తాండూరు
* బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
* ప్రేరణ- వికారాబాద్
* సాయి
* అక్రమ్-తాండూరు
* అస్లామ్-తాండూరు
ప్రమాద తీవ్రత పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు
సీఎం అదేశాలతో సీఎస్ అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు
వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ ని అదేశించారు.
Control room on Bus Accident at Secretariat
9912919545
9440854433
Additional DGP (Law and Order) Sri Mahesh M Bhagwat IPS is on the way to road accident place...Mirzaguda village of Chevella mandal in Rangareddy district.This is for information, please.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
🚨 Tragic accident in Telangana 💔
A truck driving on the wrong side crashed into a TGRTC bus near Meerjaguda, Chevella — 16 dead, several injured.
Relief efforts underway. 🙏
Heartfelt prayers for the victims & their families. 💐#Telangana #Chevella #RoadAccident #NC24 pic.twitter.com/ocPh0rqMQB— Fans (@ayush9196) November 3, 2025
చేవెళ్ళ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం
తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో... ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 3, 2025
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని…
— Telangana CMO (@TelanganaCMO) November 3, 2025
వికారాబాద్ జిల్లా ప్రమాద తీవ్రత పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం అదేశాలతో సీఎస్ అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ ని అదేశించారు Control room on Bus Accident at Secretariat 9912919545 9440854433 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంఘటనపై అధికారులతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన టిప్పర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు. ప్రమాదం లో గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని.. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ మండలం, మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో పలువురు మృత్యువాత పడటం హృదయం ద్రవించిపోయింది. మృతులకు అశ్రు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని…
— Lokesh Nara (@naralokesh) November 3, 2025
#WATCH | Rangareddy, Telangana | Around 20 people died and 20 injured in an accident between a TGSRTC bus and a truck near Khanapur Gate under Chevella police station area in Rangareddy district.
Visuals from the spot. pic.twitter.com/e10qYwymDB
— ANI (@ANI) November 3, 2025
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2025
కాసేపట్లో మంత్రులు పొన్నం. శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ, ఆర్టీసీ ఎండీ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ ప్రమాద తీవ్రత పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం అదేశాలతో సీఎస్ అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ ని అదేశించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంఘటనపై అధికారులతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన టిప్పర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు. తెలంగాణలో జరిగిన బస్సు యాక్సిడెంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24కి చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంలో 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమం.. ఇప్పటికే 24 మంది చనిపోయినట్లు గుర్తించిన అధికారులు.. చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి చికిత్స.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలింపు.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తనుషా, సాయి ప్రియ, నందిని మృతి.. మృతులు తాండూరు వడ్డెర గల్లీకి చెందిన వారిగా గుర్తింపు..
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించారని, అందులో 15 నెలల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న రాజేంద్రనగర్ జోన్ డిసిపి యోగేష్ గౌతమ్, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
కాసేపట్లో చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలికి చేరుకోనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24 మృతి..ఒక్క 6 నెలల పాప కూడా ఉంది.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న రాజేంద్రనగర్ జోన్ డిసిపి యోగేష్ గౌతమ్, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
కాసేపట్లో చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలికి చేరుకోనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24 మృతి..ఒక్క 6 నెలల పాప కూడా ఉంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య…
— G Kishan Reddy (@kishanreddybjp) November 3, 2025
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులంతా తక్షణమే హాస్పిటల్స్‌కు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఈ ఘటనను పలువురు ప్రముఖులు ఖండించారు.
బస్సు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి
----------------------------------------
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు క్యాబినెట్ సహచరులు వెంటనే స్పందించి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
BREAKING NEWS
18 feared dead in a horrific road accident in Rangareddy District #Telangana
An RTC bus from Tandur depot collided with a tipper lorry loaded with gravel.
Accident happened on the Hyderabad–Bijapur highway near Meerjaguda in Chevella Mandal of Rangareddy… pic.twitter.com/oMDoMpXj7j
— Revathi (@revathitweets) November 3, 2025
#BigBreaking | Tragic road accident in #RangaReddy district 💔 A devastating collision between an RTC bus and a tipper lorry on the Hyderabad–Bijapur highway near Mirzaguda, Chevella mandal, has claimed 17 lives, including the bus driver. Authorities fear the death toll may rise… pic.twitter.com/0JE2MCOLi3
— Voiceup Media (@VoiceUpMedia1) November 3, 2025
Deeply shocked and saddened by the tragic road accident involving an RTC bus and a tipper lorry on the Hyderabad–Bijapur highway in Mirzaguda, Chevella, Rangareddy district, which left many dead and several others seriously injured.
My heartfelt condolences to the families who…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 3, 2025
VIDEO | Rangareddy: Several injured after a tipper collided with a Tandur RTC bus near Mirjaguda on the Hyderabad-Bijapur highway.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZwgBJcTDtn
— Press Trust of India (@PTI_News) November 3, 2025
VIDEO | Rangareddy: Several injured after a tipper collided with a Tandur RTC bus near Mirjaguda on the Hyderabad-Bijapur highway.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZwgBJcTDtn
— Press Trust of India (@PTI_News) November 3, 2025
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైన ఘటనపై బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు . మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దిగ్భ్రాంతి....
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
సంఘటనపై అధికారులతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన టిప్పర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు.
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేటీఆర్ ద్రిగ్బ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మృతి చెందడం మరియు పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన దుర్ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సమాచారం అందగానే జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
*
క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
*
గాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Telangana IT and Industries Minister, and In-Charge Minister for the erstwhile Ranga Reddy district, Duddilla Sridhar Babu expressed deep shock and anguish over the tragic accident near Mirzaguda in Chevella mandal, where an RTC bus was hit by a tipper lorry.
*
Upon receiving the information, the Minister immediately alerted the District Collector, Police officials, and senior officers of concerned departments. He sought a detailed report on how the accident occurred and the present condition of the injured. He issued directions on the relief and rescue operations, instructing officials to reach the accident site without delay and personally supervise the rescue efforts.
*
The Minister also instructed the senior officials of the Medical and Health Department to ensure the best possible treatment for the injured at the Chevella Government Hospital. He held a teleconference with the relevant authorities to monitor the situation and review the measures being taken.
*
He further directed officials overseeing the rescue operations to reassure the victims and their families that the government stands firmly by them. He instructed that complete information about every injured person must be promptly communicated to their family members
ఈ సహాయక చర్యలో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి ఎక్కిన జీసీబీ.. సీఐ ని సైతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 17 మృతి..రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించారని, అందులో 15 నెలల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైన ఘటనపై బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు . మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలి... మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 3, 2025
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.కంకర లోడు తో ఉన్న టిప్పర్ రోడ్డు రాంగ్ రూట్లో వచ్చి బస్సు ను ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. హుటాహుటిన ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
Chevella Bus Accident Live Updates: రీసెంట్ గా కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ప్రమాదం మరవకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సును కంకరతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సహా 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు అక్కడ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోనకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే బస్సులో ప్రయాణం చేస్తోన్న వారి బంధు మిత్రుల ఇళ్లలో ఆందోళన నెలకొంది.
మరిన్ని లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..